• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హరీష్ శంకర్ 'సిద్ధార్థ్...

హరీష్ శంకర్ 'సిద్ధార్థ్ రాయ్' ఎవరి కోసం..?

By - Tupaki Desk
Update: 2022-11-14 23:30 GMT
స్టార్ డైరక్టర్ హరీశ్ శంకర్ గద్దలకొండ గణేష్ తర్వాత మరో మూవీ చేయలేదు. గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ చేస్తూ పవర్ స్టార్ తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ ఎనౌన్స్ చేసినా ఇంతవరకు అది సెట్స్ మీదకు వెళ్లలేదు. అసలు మూవీ ఉంటుందా లేదా అన్న క్లారిటీ కూడా లేదు. ఇప్పటికే 3 ఏళ్లుగా సినిమా లేక ఖాళీగా ఉన్న హరీశ్ శంకర్ పవన్ సినిమా కోసం మరో ఏడాది వెయిట్ చేయక తప్పేలా లేదు. ఈలోగా యువ హీరోతో సినిమా చేయాలని అనుకోగా అది కూడా వర్క్ అవుట్ కాలేదు. సినిమాలు చేయడం లేదు కానీ హరీశ్ శంకర్ వరుస టైటిల్స్ రిజిస్టర్ చేయిస్తున్నట్టు తెలుస్తుంది.

హరీశ్ శంకర్ లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ రిజిస్టర్ చేయించాడట. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా సిద్ధార్థ్ రాయ్. సిద్ధు సిద్ధార్థ్ రాయ్ ఈ డైలాగ్ చాలా ఫేమస్ కదా.. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పాపులరే. ఇప్పుడు అదే టైటిల్ ని రిజిస్టర్ చేయించడం ఆసక్తికరంగా మారింది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సిద్ధార్థ్ రాయ్ టైటిల్ రిజిస్టర్ చేయించాడట హరీశ్ శంకర్. ఇంతకీ ఈ టైటిల్ ఎవరి కోసం..? సిద్ధార్థ్ రాయ్ టైటిల్ కూడా పవన్ కే అన్న టాక్ వినిపిస్తున్నా.. ఆల్రెడీ ఎనౌన్స్ చేసిన భవదీయుడు భగత్ సింగ్ సినిమానే హరీశ్ శంకర్ సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయాడు. ఇప్పుడు ఇంకో టైటిల్ అది కూడా పవన్ కోసం అంటే షాక్ అవుతున్నారు ఆడియన్స్.

హరీశ్ శంకర్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తారని టాక్. విజయ్ సినిమా కోసమే సిద్ధార్థ్ రాయ్ అనే టైటిల్ హరీశ్ రిజిస్టర్ చేయించాడని అంటున్నారు.

అదే జరిగితే వరుసగా పవన్ సినిమాలు.. పవన్ పాత్రల పేరుతో విజయ్ సినిమాలు వస్తున్నాయని చెప్పొచ్చు. విజయ్ ఇప్పటికే పవర్ స్టార్ ఖుషి టైటిల్ వాడేస్తున్నాడు. ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ కూడా అతనే అంటున్నారు.

టైటిల్స్ రిజిస్టర్ చేయించడం వరకు ఓకే కానీ సినిమాలు మాత్రం చాలా లేట్ గా తీస్తున్నాడు హరీశ్ శంకర్. ఈ విషయంలో అతను చాలా వెనకపడి ఉన్నాడని చెప్పొచ్చు. 3 ఏళ్లుగా ఒక్క సినిమా తీయని ఆయన స్టార్ హీరో డేట్స్ కోసం కెరియర్ రిస్క్ లో పడేసుకుంటున్నారు. భవదీయుడు భగత్ సింగ్ పూర్తి కాకుండానే సిద్ధార్థ్ రాయ్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వార్తల్లో నిలిచారు హరీశ్ శంకర్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • HarishShankar 
  • SiddharthRoy 
  • KhushiMovieDialouge 
  • Title 
  • MythriMovieMakers 
  • BhaavadeeyuduBhagatSingh 
  • VijayDevarkonda 
  • MovieNews 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS