క్వారంటైన్‌ లో సబ్బులు తయారు చేస్తున్న శృతి హాసన్

Update: 2020-03-26 09:45 GMT
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో  ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఎవరూ బయటికి వెళ్లొద్దని, ఇంటికే పరిమితం కావాలని సూచించిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సెలెబ్రెటీలు ఖాళీగా ఉండటంతో కావాల్సినంత టైం దొరికి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారైతే 14 రోజులు నిర్బంధంలో ఉండాలన్న ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్వారంటైన్‌లో గడుపుతున్నారు. ఇక శృతి హాసన్ అయితే ఏకంగా లండన్ రిటర్న్. ఎయిర్ పోర్ట్ లో ఆమె చేతిపై స్టాంప్ కూడా వేశారు. లండన్ నుంచి వచ్చిన శృతి హాసన్ కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లోనే ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే క్వారంటైన్‌లో 10 రోజులు పూర్తి చేసుకున్న శృతి హాసన్...ఈ టైమ్‌లో స్వయంగా ఆర్గానిక్ సబ్బులు తయారు చేసిందట.

ఈ సందర్భంగా స్వీయ నిర్బంధంలో ఆల్రెడీ 10 రోజులు అయిపోయాయని చెబుతుంది శృతి. ఈ పది రోజుల ఒంటరి జీవితంలో ఆర్గానిక్ సబ్బులు తయారు చేశానని చెప్పుకొచ్చింది శృతి హాసన్. ఇంట్లో వంట చేయడంతో పాటు కొన్ని బేకింగ్ ఐటమ్స్ కూడా చేశానని స్పష్టం చేసింది. బోర్ కొట్టే సమస్య లేదని, ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు అన్ని పనులు తానే చేయాలనీ, పని మనిషిని కూడా మాన్పించేశానని అంటుంది శృతి. అందరు తనలా శ్రద్దగా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని పిలుపునిచ్చింది. వివిధ పనుల మీద, వివిధ దేశాలకు వెళ్లిన తన కుటుంబ సభ్యులు కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారని, ప్రస్తుతం తామంతా ఒకరిని ఒకరం కలుసుకోవడం లేదని, వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నాయని శృతి స్పష్టంగా చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ఊరికే ఇంట్లో ఉండడం బోర్ అనుకునేవాళ్లు, ఎంచక్కా శృతి హాసన్‌ను ఫాలో అయిపోండి అంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ‘వకీల్ సాబ్‌’ సినిమాలో హీరోయిన్‌ గా ఎంపికైన ఈ అమ్మడు, ఈ సమయానికి ఆ షూటింగ్‌లో బిజీగా ఉండాల్సింది. అయితే పరిస్థితులు మారిపోవడంతో ఇంట్లో ఒంటరిగా గడుపుతూ తనను తాను తెలుసుకుంటోందంట. దీంతోపాటు గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ సరసన 'క్రాక్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News