శ్రుతి చెప్పింది.. పవన్ అండ్ కో ఏమంటుంది?

Update: 2016-10-14 07:30 GMT
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’.. తమిళ హిట్ మూవీ ‘వీరం’కు రీమేక్ అని మొదట్నుంచి ప్రచారం జరుగుతోంది. ఇందులో పవన్ గెటప్.. ఆ పాత్రకు సంబంధించి బయటకు వచ్చిన విశేషాలు.. పవన్ కు తమ్ముళ్లుగా నలుగురు నటించడం.. ఇవన్నీ చూస్తుంటే అది నిజమే అన్న భావన కలిగింది. కానీ ‘కాటమరాయుడు’ టీం మాత్రం ఇది రీమేక్ అన్న వార్తల్ని ఖండించింది. దీంతో అందరూ డైలమాలో పడ్డారు. కానీ ఇప్పుడు శ్రుతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాటమరాయుడు రీమేక్ అనేయడం విశేషం.

కెరీర్లో చాలా వరకు రీమేక్ సినిమాలే చేస్తున్నారేంటి అని ఆ ఇంటర్వ్యూలో శ్రుతిని అడిగితే.. ‘‘అవును. చాలా వరకు రీమేక్ సినిమాలే చేశాను. ఇప్పుడు నేను పవన్ తో చేస్తున్నది కూడా రీమేకే. నేను రీమేక్ రాణిని అయిపోయాను. ఐతే ఫలితాలు సానుకూలంగా ఉన్నపుడు ఇబ్బందేమీ లేదు. అయినా రీమేక్ అయినప్పటికీ నేను ప్రతి పాత్రనూ కొత్తగానే చూస్తా. నా శైలిలో ఆ పాత్రను పండించడానికి ప్రయత్నిస్తా’’ అని శ్రుతి చెప్పింది. మరి శ్రుతి ‘కాటమరాయుడు’ రీమేక్ అని కన్ఫమ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు దాని టీం సభ్యులు ఏమంటారో చూడాలి.
Read more!

మరోవైపు పవన్ కళ్యాణ్ తో పని చేయడం గురించి శ్రుతి మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లో ఆయనది ప్రత్యేకమైన స్థానం. నా కెరీర్లో తొలి బిగ్ హిట్ గబ్బర్ సింగ్ ఆయనతో చేసిందే. ఆయనతో పని చేసి చాలా కాలమైంది. మళ్లీ ఇప్పుడు ‘కాటమరాయుడు’ చేస్తున్నా. ఈ సినిమా షూటింగ్ లో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నా’’ అని శ్రుతి తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News