#శ్రుతి.. ఎంత క్రాక్ ఎక్కినా అంత బోల్డ్ గానా?

Update: 2020-12-07 08:11 GMT
చాలా గ్యాప్ త‌ర్వాత పోగొట్టుకున్న స్టార్ డ‌మ్ ని తిరిగి వెన‌క్కి తేవాలంటే అంత సులువేమీ కాదు. పైగా పోగొట్టుకున్న‌చోటే రాబ‌ట్టుకోవడం ఆషామాషీనా? అందుకేనేమో.. అందాల శ్రుతిహాస‌న్ అంత లైట్ తీస్కున్న‌ట్టు లేదు. ఎట్టి ప‌రిస్థితిలో పోగొట్టుకున్న స్టార్ డ‌మ్ ని తిరిగి తెచ్చే వ‌ర‌కూ విడిచిపెట్టేట్టు లేదు వాల‌కం చూస్తుంటే.

ఓవైపు కంబ్యాక్ మూవీ క్రాక్ కి ప్ర‌చారం అద‌ర‌గొట్టేస్తున్న ఈ భామ నెటిజ‌నుల కంటికి కునుకు ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. నిరంత‌రం ఏదో ఒక వేడెక్కించే ఫోటోని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూ దుమారం రేపుతోంది శ్రుతి.

బికినీ లుక్.. స్విమ్ సూట్లు పాత‌బ‌డిపోయాయి. థై స్లిట్ డ్రెస్సులు మిడ్డీలు రొటీన్ అయిపోయాయి. అందుకేనేమో.. ఇదిగో ఇలా రెండు పాయ‌లుగా చీలిపోయిన లెద‌ర్ ఇన్న‌ర్ తో ద‌ర్శ‌న‌మిచ్చింది. సీకే బ్యూటీ దిశాప‌టానీకే దిమ్మ‌తిరిగే ట్రీట్ ఇది. శ్రుతి నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ నెస్ కి కుర్ర‌కారు ఫిదా అయిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ బోల్డ్ ఫోటోని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు నెటిజ‌నం. సింపుల్ బ్లాక్ ఇన్న‌ర్ కి జ‌తగా ఖ‌రీదైన వ‌జ్రాల నెక్లెస్ ని మెడ‌లో ధ‌రించిన శ్రుతి అందం ప‌దింత‌లైంది. మేక‌ప్ లేకుండానే అంత హాట్ గా క‌వ్వించేయ‌డం త‌న‌కే చెల్లింది.

భాగ్య‌ల‌క్ష్మి ఇమేజ్ కి పూర్తి భిన్న‌మైన ఈ బోల్డ్ లుక్ పై అభిమానులు ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. అన్న‌ట్టు పింక్ రీమేక్ వ‌కీల్ సాబ్ లో ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టిస్తోంది. అందుకు సంబంధించిన లుక్ రావాల్సి ఉంది ఇంకా.
Tags:    

Similar News