కాస్టింగ్ కౌచ్ పై ఆమె మళ్లీ..

Update: 2018-06-17 07:24 GMT
హీరోయిన్లకే కాదు.. సినీ రగంలో వేరే విభాగాల్లో పని చేసే అమ్మాయిలకు కాస్టింగ్ కౌచ్ బెడద తప్పదని కొన్ని నెలల కిందట లిరిసిస్ట్ శ్రేష్ఠ చేసిన ఆరోపణలతో రుజువైంది. ‘అర్జున్ రెడ్డి’.. ‘పెళ్ళిచూపులు’ లాంటి సినిమాలకు సాహిత్యం అందించిన శ్రేష్ఠ కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ధైర్యంగా మాట్లాడింది. కమిట్మెంట్ల కోసం తనను ఇండస్ట్రీ జనాలు ఎలా వేధించిందీ వెల్లడించింది. తాజాగా ఆమె ఓ జాతీయ మీడియా సంస్థతో ఈ విషయంపై మాట్లాడింది. మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.

ఒక నిర్మాతకు పడక సుఖం అందించాలని స్వయంగా అతడి భార్యే తనను అడిగినట్లుగా శ్రేష్ఠ ఆరోపించింది. అలాగే ఒక మహిళా దర్శకురాలు కూడా తనను ఈ విషయంలో ఇబ్బంది పెట్టినట్లు వెల్లడించింది. ఒక ఇండస్ట్రీ వ్యక్తి గోవాలో తన కోసం పార్టీ ఏర్పాటు చేశాడని.. అతను తన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటున్నాడని.. అక్కడికి వెళ్లి అతడికి సహకరించాలని ఆ దర్శకురాలు తనను ఫోర్స్ చేసినట్లు శ్రేష్ఠ వెల్లడించింది. తాను నో చెప్పినందుకు తనకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్లు ఆమె చెప్పింది.

సినీ రంగంలో కేవలం రచనతోనే ఎదగడం కష్టమని.. ఇలాంటి కాంప్రమైజ్ తప్పదని తనకు ఇక్కడి జనాలు చెప్పారని ఆమె పేర్కొంది. ఇలాంటి అనుభవాలతో తాను సినీ రంగం అంటేనే భయపడిపోయానని.. కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా కూడా ఉన్నానని.. ఐతే తర్వాత దృఢంగా నిలబడి ఇక్కడ నెట్టుకొస్తున్నానని ఆమె చెప్పింది. గత కొన్ని నెలల పరిణామాలతో టాలీవుడ్లో కాస్టింగ్ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఇండస్ట్రీలో మార్పొస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News