హిట్ తర్వాత హైద్రాబాద్ పై శ్రద్ధ
శ్రద్ధాదాస్.. చాలా సంవత్సరాలుగానే టాలీవుడ్ లో ఉంది. ఇక్కడ వెలిగిపోయేందుకు బాగానే ప్రయత్నించింది కానీ.. ఆశించిన బ్రేక్ రాలేదు ఈ భామకు. ఇన్నేళ్లకు గుంటూరు టాకీస్ లో ఈమె చేసిన బోల్డ్ పాత్రకు బోలెడంత క్రేజ్ వచ్చింది. ఎంత ఓపెన్ గా నటించగలదో చూపించేసరికి.. ఇప్పుడు శ్రద్ధాదాస్ కి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ ఎఫెక్ట్ తో హైద్రాబాద్ లో ఇల్లు కొనుక్కుందామని అనుకుంటోందట శ్రద్ధా దాస్.
ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది. 'హైద్రాబాద్ లో ఇల్లు కొనుక్కోవడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నా. ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది. గుంటూరు టాకీస్ సక్సెస్ తో హ్యాపీ హ్యాపీ' అంటూ ట్వీట్ చేసిన శ్రద్ధాదాస్.. తను హైద్రాబాద్ వస్తూ దిగిన ఓ ఫోటోను కూడా నెట్ లో పెట్టేసింది. అంటే ఇకనుంచి హైద్రాబాద్ పై శ్రద్ధా దాస్ శ్రద్ధ పెట్టనుందన్న మాట. ఇలా సక్సెస్ సాధించి టాలీవుడ్ లో సెటిల్ అయిపోతున్న భామల జాబితాలో శ్రద్ధ ఇప్పుడు చేరింది కానీ... రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే ఈలిస్ట్ లో ఫస్ట్ ఉంది.
ఇన్నేళ్లూ హైద్రాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. రీసెంట్ గా ఓ పోష్ హౌజ్ ఒకటి కొనుక్కుని సెటిల్ అయిపోయింది. తన తల్లి - సోదరుడుని కూడా ఇక్కడికి తీసుకొచ్చి సెటిల్ చేసేస్తోంది రకుల్. సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసేసింది ఈ భామ.