• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'బిగ్ బాస్-5' వారితో...

'బిగ్ బాస్-5' వారితో మరింత గ్లామరస్ గా మారనుందా..??

By - Tupaki Desk
Update: 2021-04-01 11:34 GMT
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో అంటే మాములు క్రేజ్ లేదు. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ క్రమం తప్పకుండా వీక్షించేవారు మిలియన్స్ సంఖ్యలో ఉన్నారు. అంతేగాక బిగ్ బాస్ వీక్లీ ఓసారి రిపీట్ చేసుకొని చూసేవారి సంఖ్య కూడా బాగానే ఉంది. వీరందరిని పక్కన పెడితే మరో రకం ఉంటారు.. షో చూడకపోయినా వీక్లీ ఎవరు ఎలిమినేట్ అయ్యారని కనుక్కుంటూ ఉంటారు. అలా కూడా ఉన్నారా అనే సందేహం కలగొచ్చు.. కానీ ఆ కోవకు చెందిన లిస్ట్ కూడా పెద్దదే. వారికి చూసే సమయం లేకనో.. లేదా పనిలో నిమగ్నమై ఉండటం.. లాంటివి ఎవరి కారణాలు వాళ్ళకి ఉంటాయి కదా! అయితే త్వరలోనే బిగ్ బాస్ గ్రాండ్ గా ప్రారంభం కానుందని ఇటీవలే స్టార్ మా యాజమాన్యం తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే ఈ బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి నాలుగు సీజన్లను కాదనుకుండా సక్సెస్ చేస్తూ వచ్చారు ప్రేక్షకులు. మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా.. రెండవ సీజన్ నాని హోస్ట్ చేసాడు. తర్వాత నుండి వరుసగా కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఐదవ సీజన్ కూడా ఆయనే హోస్ట్. ఐతే బిగ్ బాస్ 5 కోసం జనాలు ఎప్పటినుందో ఎదురు చూస్తున్నారు. కరోనా రావడంతో అన్నీటి టైమింగ్స్ మారిపోయాయి. బిగ్ బాస్ అభిమానులలో కంటెస్టెంట్స్ ఎవరనేది ఆసక్తి మొదలైంది. ఫ్యాన్స్ అంచనాలు రెట్టింపు చేస్తూ బిగ్ బాస్ యాజమాన్యం.. ఈసారి ఇద్దరు పేరున్న హీరోలను ముగ్గురు గ్లామరస్ హీరోయిన్లను తీసుకొస్తాం అని ఊరించారు. ఐదవ సీజన్ జులై నుండి మొదలయ్యే అవకాశం ఉందట. ఈసారి యూట్యూబ్ స్టార్స్ అలాగే ఇంస్టాగ్రామ్ స్టార్స్ కూడా వస్తారనే అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి బిగ్ బాస్ యాజమాన్యం ఎలాంటి ప్రణాళిక చేస్తుందో!
Tags:    
  • Bigg Boss 5 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS