ఫోటో స్టొరీ: బ్రైడ్స్ టుడే కోసం తెనాలి బ్యూటీ
సినీరంగంలో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు చాలామందే ఉన్నారు కానీ మోడలింగ్ ఫీల్డ్ లో సత్తా చాటిన వారు మాత్రం లేరు. ఆ లోటు తీర్చడానికి అన్నట్టుగా శోభిత ధూళిపాళ మోడలింగ్ రంగంలోకి దూసుకొచ్చింది. ఈ తెలుగు బ్యూటీ ఫ్యాషన్ రంగంపై తనదైన ముద్ర వేసింది. ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో సెకండ్ ప్లేస్ సాధించిన ఈ భామ ఆదే ఏడాది మిస్ ఎర్త్ 2013 పోటీల్లో ఇండియా తరఫున పాల్గొంది. ఇక కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై కూడా ఈ భామ మెరిసింది. మోడలింగ్ లో తన టాలెంట్ చూపించిన ఈభామ ప్రస్తుతం సినీ రంగంలో తన సత్తా చాటే ప్రయత్నాల్లో ఉంది. పనిలో పనిగా సోషల్ మీడియాలో మంటలు రేపుతూ ఉంటుంది.
తాజాగా శోభిత బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకుంది. పైనున్న ఫోటో ఈ అందులోనిదే. క్లోజప్ లో తీసిన ఈ ఫోటోలో శోభిత ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. మెడలో వెడల్పాటి సిల్వర్ కలర్ నెక్లెస్.. చెవులకు కూడా సిల్వర్ కలర్ లో ఉన్న ఇయర్ రింగ్స్ ధరించింది. హెయిర్ స్టైలింగ్ చిందరవందరగా చేయడంతో ఘాటు అందాల అపరిచితురాలిలాగా కనిపిస్తోంది. అందాల ప్రదర్శన లేదు కానీ ఆ ఎక్స్ ప్రెషనే వంద హాటు ఫోటోలకు సమానం అన్నట్టుగా ఉంది. అన్నిటిలో హైలైట్ మాత్రం పర్ఫెక్ట్ లిప్ స్టిక్ తో మెరుస్తూ ఉన్న దొండపండ్ల లాంటి పెదవులే.
అందుకే నెటిజనులు వెర్రెత్తిపోయి ఘాటు కామెంట్లు పెట్టారు. "ఈ ఫోటో చూస్తే నీకు మళ్ళీ మళ్ళీ ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తోంది".. "సెన్సువల్ & హాట్ బ్రైడ్".. "చిక్ లుక్.. సెన్సిబుల్ ఎక్స్ ప్రెషన్".. "100% చాకొలేట్" అంటూ కామెంట్లు పెట్టారు. కానీ ఒక నెటిజన్ మాత్రం "పెళ్ళి కూతురు ఫోటో షూట్ కదా.. నీరసంగా ఎందుకున్నావ్?" అని ప్రశ్నించాడు. ఈ కామెంట్ల సంగతేమో కానీ శోభిత ప్రస్తుతం సినిమాలతో.. వెబ్ సీరీస్ లతో బిజీగా ఉంది. నివిన్ పౌలీ హీరోగా నటిస్తున్న మలయాళం-హిందీ ద్విభాషా చిత్రం 'మూతోన్' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా 'సేక్రేడ్ గేమ్స్ 2'.. 'బార్డ్ ఆఫ్ బ్లడ్' అనే వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది. తెలుగులో 'గూఢచారి' సినిమా చేసింది కానీ దాని తర్వాత మరో సినిమాకు సైన్ చెయ్యలేదు.