సీనియ‌ర్స్ స‌ల‌హాలు తీసుకోవ‌డంలో ఉత్త‌ముడు!

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న న‌టుడు.;

Update: 2026-03-22 00:30 GMT

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న న‌టుడు. ప్రతిభతో పాటు, నిరంతరం నేర్చుకోవాలనే తపన నిఖిల్ లో క‌నిపిస్తుంది. సాధారణంగా స్టార్ హీరోలకు ఉన్న ఇమేజ్‌తో తమకే అంతా తెలుసనే ధీమా ఉంటుంది. కానీ నిఖిల్ మాత్రం అందుకు భిన్నం. పరిశ్రమలోని సీనియర్ నటుల నుంచి సూచనలు, సలహాలను గౌరవంగా స్వీకరిస్తాడు. అంతేకాదు వాటిని ఆచరణలోనూ పెడుతంటాడు.ఇతర హీరోల మాదిరిగా విన్న వెంటనే మర్చిపోయే రకం కాదు. కథా ఎంపికలో గానీ, పాత్రను మలచుకునే విధానంలో గానీ సీనియర్లు చెప్పిన మెళకువలను తనదైన శైలిలో అన్వయించుకుంటాడు.

అనుభవం ఉన్న వారి మాటలకు విలువ ఇవ్వడం అత‌డి కెరీర్ కి ఎంతో ప్ల‌స్ అయింది. ఆరంభం నుంచి నిఖిల్ తనను తాను ఒక పరిణతి చెందిన నటుడిగా మలచుకోగలిగాడు.`స్వామి రారా` నుంచి `కార్తికేయ 2` వరకు నిఖిల్ చేసిన ప్రయోగాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. ఈ వైవిధ్యం వెనుక సీనియర్ల సలహాలు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నటనలో సహజత్వం ఎలా ఉండాలి? ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలి? అనే విషయాల్లో నిఖిల్ సీనియర్ల అనుభవాన్ని అస్త్రంగా వాడుకుంటాడు.

నిఖిల్ ఒక స్టూడెంట్ లాంటి మనస్తత్వంతోనే ఉంటాడ‌ని ఆయ‌న్ని మ‌రింత ద‌గ్గ‌ర‌గా చూసిన‌వాళ్లు చెబుతుంటారు. అందుకే నిఖిల్ కు ఇంతటి సక్సెస్ దక్కుతోందని ఇండస్ట్రీలోని సన్నిహితులు చెబుతుంటారు. సలహాలను వినడం కంటే? వాటిని అమలు చేయడంలోనే నిఖిల్ ప్రత్యేకత ఉంది. తన తప్పులను సరిదిద్దుకోవడానికి లేదా నటనలో మెరుగులు దిద్దుకోవడానికి ఏమాత్రం సంకోచించడు. ఇతరుల అభిప్రాయాలను విశ్లేషించడం, తనకు ఏది సరిపోతుందో బేరీజు వేసుకోవడం అత‌డి ప్లానింగ్‌లో భాగంగా క‌నిపిస్తుంది. ఈ క్రమశిక్షణను నిఖిల్ ని కొంత మంది హీరోల నుంచి స‌ప‌రేట్ చేస్తుంది.

సలహాలను గౌరవించే ఈ ‘గుణమే’ ఆయనను తోటి యువ హీరోల కంటే భిన్నంగా చూపిస్తోంది.ఆర‌కంగా నిఖిల్ కేవలం ఒక నటుడిగానే కాకుండా? కొత్త విషయాలను అన్వేషించే వ్యక్తిగా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూ దానిని తన విజయానికి మెట్లుగా మలచు కుంటున్నాడు. భ‌విష్య‌త్ త‌రం నటులు నిఖిల్ లాంటి వాళ్ల‌ను స్పూర్తిగా తీసుకొవ‌చ్చు. అలాంటి న‌టులు టాలీవుడ్ లో మ‌రిన్ని విజ‌య శిఖ‌రాలు అధిరోహించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ప్ర‌స్తుతం నిఖిల్ హీరోగా `స్వ‌యంభూ` చిత్రం తెర కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. వాటిని పూర్తి చేసుకుని పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది.

Tags:    

Similar News