సీనియర్ నటుడి ఆరోగ్య పరిస్థితి నిలకడ!

Update: 2020-05-07 15:35 GMT
దేశంలో కరోనా వైరస్ కారణంగా సెలబ్రిటీలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే స్టార్స్ సడన్ గా ఇంట్లో ఉండేసరికి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను దగ్గరలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారట. ఇది జరిగి కూడా మూడు రోజులు అవుతుంది. అయితే బిపి డౌన్ కావడంతోనే అలా సడన్ స్ట్రోక్ వచ్చిందని.. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం కుదుటపడిందని సమాచారం. తగిన సమయంలో వైద్యులు సరైన చికిత్స అందించి.. హార్ట్‌లో స్టెంట్ వేశారట. ప్రస్తుతం శివాజీ రాజా కోలుకొంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొందరు స్నేహితులు ఆయన్ని ఫోన్‌ ద్వారా సంప్రదించి పరామర్శిస్తున్నారట. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుసుకుని ఆనందించారు.

అలాగే కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత శివాజీ రాజాను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారట. గతేడాది మా అసోసియేషన్ ఎన్నికలల్లో ఓటమి తర్వాత శివాజీరాజా పెద్దగా బయటికి రావడం లేదు. ఈ మధ్యే కరోనా నేపథ్యంలో ఆయన తన ఫామ్ హౌస్‌లో పండించిన కూరగాయలను సినీ కార్మికులకు పంచి అండగా నిలబడ్డాడు. అంతలోనే ఆయనకు హార్ట్ ఎటాక్ రావడం ఆయన శ్రేయోభిలాషులను కంగారు పెట్టింది. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. సడన్ గా గుండెపోటు రావడంతో చికిత్స పొంది గత రెండు రోజులుగా పరిశీలనలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఇటీవలే శస్త్రచికిత్స ద్వారా స్టెంట్ వేసిన తరువాత అతను బాగానే ఉన్నాడు. ఇక శివాజీ రాజా కూడా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కొడుకు విజయ్ రాజా తెలిపారు. శివాజీ రాజా గత కొన్ని రోజులుగా నిత్యావసరాలను విరాళంగా అందిస్తూ.. సినీ కార్మికుల కోసం తన వంతు కృషి చేస్తున్నారు. అతను త్వరలోనే సాధారణ స్థితికి వస్తాడని ఆశిద్దాం!
Tags:    

Similar News