ప్ర‌కృతిలో ఆకాశం అంచుకు ఎగిరిపోతున్న షాలిని

Update: 2020-12-22 23:30 GMT
కొండ‌లు కోన‌లు ఒత్త‌యిన‌ గ‌డ్డి ఎన్నులు.. ఆహా ఏమి ఆ ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌! శ‌రదృతువులో ప‌చ్చా ప‌చ్చని అందాలు.. నీలినీలి కొండ‌ల వైపుగా.. ఈ అమ్మ‌డి ఆగ‌ని ప‌రుగు సంగ‌తేమో కానీ ప్ర‌కృతి మొత్తం త‌న అందం వీక్ష‌ణ‌కు దిగొచ్చిందా? అన్న‌ట్టుగానే ఉందా దృశ్యం.

ఇన్నాళ్లు షాలిని ఏమైంది? అంటూ వెతుకుతున్న క‌ళ్ల‌కు ఇదిగో ఇదే ప్ర‌త్య‌క్ష స‌మాధానం. ఈ క్రైసిస్ కాలంలో కుటుంబంతో కాల‌క్షేపం చేసినా .. నెమ్మ‌దిగా అన్ లాక్ సీజ‌న్లో తిరిగి కెరీర్ ప‌రుగులో బిజీ అయిపోతోంది‌ట‌. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేష‌న‌ల్ హిట్ మూవీలో న‌టించాక అంద‌రి క‌ళ్లు షాలిని పాండేపైనే ప‌డ్డాయి. వ‌రుస‌గా ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. క్లాసికల్ హిట్ మూవీ `మ‌హాన‌టి`లోనూ చ‌క్క‌ని పాత్ర‌లో అభిన‌యించింది. అనుష్క మూగ యువ‌తిగా న‌టించిన నిశ్శ‌బ్ధంలోనూ సోనాలి పాత్ర‌లో మెరిపించింది.

ప్ర‌స్తుతం జ‌యేష్ భాయ్ జోర్ధార్ అనే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టిస్తోంది. ఇది బాలీవుడ్ లో డెబ్యూ సినిమా. య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. ర‌ణ‌వీర్ సింగ్ లాంటి స్టార్ హీరో ఇందులో న‌టిస్తుండ‌డం విశేషం. నిజానికి 2020 గాంధీ జ‌యంతికి ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఆల‌స్య‌మైంది. ప్రస్తుతం థియేట్రిక‌ల్ రిలీజ్ ప్లాన్ లో ఉంది టీమ్. ఇక‌పై షాలిని హిందీ బెల్ట్ లోనూ పాపులారిటీ ద‌క్కించుకోనుంది. న‌టిగా స‌త్తా చాటి అక్క‌డా బిజీ అయిపోతుందేమో!

ఈలోగానే ఇలా స‌రికొత్త ఫోటోషూట్ తో అభిమానుల ముందుకొచ్చింది. ``హోక‌స్ పోక‌స్ అండ్ చిల్!`` అంటూ అదిరిపోయే క్యాప్ష‌న్ ఇచ్చింది ఈ అంద‌మైన ఫోటోకి. బ్లాక్ టాప్ .. స్పోర్ట్ షార్ట్ లో ఆ ప్ర‌కృతిలో అదిరిపోయే ఫోటోషూట్ తో అభిమానుల్ని మురిపిస్తోంది. ప్ర‌కృతిని త‌న‌లో విలీనం చేసుకుంటూ ఒదిగిపోయి ఫోటోషూట్లో పాల్గొన్న వీడియో కూడా ఇన్ స్టాలో వైర‌ల్ అవుతోంది.Full View
Tags:    

Similar News