• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లు అర్హ కు గ్రాండ్...

అల్లు అర్హ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన 'శాకుంతలం' టీమ్..!

By - Tupaki Desk
Update: 2021-08-03 10:30 GMT
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక ప్రేమగాధ ''శాకుంతలం''. ఇందులో సమంత అక్కినేని - మలయాళ హీరో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మహాభారత గాథ ఆదిపర్వంలోని శకుంతల - దుష్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ తెరంగ్రేటం చేస్తోంది.

'శాకుంతలం' చిత్రంలో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్హ కనిపించనుంది.  ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ లో అల్లు వారి గారాల పట్టి కూడా జాయిన్ అయింది. తాజాగా అల్లు అర్హ కు మేకప్ వేస్తున్న ఓ వీడియోని బయటకు వదిలారు. అలానే గుణశేఖర్ కుమార్తె మరియు నీలిమ గుణ కూడా ట్విట్టర్‌ లో 'లిటిల్ స్టార్ అల్లు అర్హ కోసం సిద్ధంగా ఉంది' అంటూ కార్వాన్ కు సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేశారు.

అల్లు అర్హా ను తన ఫస్ట్ డే షూట్ కోసం గ్రాండ్‌ గా స్వాగతం పలకడానికి చిత్ర బృందం కార్వాన్ ను అందంగా అలంకరించారు. కార్వాన్ డోర్ వద్ద 'ARHA' లెటర్ బెలూన్‌ లతో లిటిల్ స్టార్ కు ఘనంగా స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్హ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీతో అల్లు ఫ్యామిలీ నాల్గవ తరం కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్లు అయింది. తన క్యూట్‌ నెస్‌ తో ముద్దు ముద్ద మాట‌లతో ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అర్హ.. 'శాకుంతలం' సినిమా ద్వారా అరంగేట్రం చేస్తుండటం గర్వకారణమని అల్లు అర్జున్ ఇది వరకే పేర్కొన్నారు.

కాగా, 'శాకుంతలం' చిత్రంలో శ‌కుంత‌ల‌గా స‌మంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. వీరి తనయుడు భరత పాత్రలోనే అర్హ నటిస్తోంది. సంగీత బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డీఆర్‌పీ - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Tags:    
  • allu arha 
  • allu arha photos 
  • allu arha video 
  • allu arha debut movie 
  • Shakuntalam 
  • samantha Shakuntalam 
  • Allu arha in Shakuntalam 
  • Shakuntalam shooting 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS