‘బాహుబలి’ రెండుసార్లు చూశా-షారుఖ్ ఖాన్

Update: 2017-01-29 14:07 GMT
ఎంతవారు కానీ.. బాహుబలి దాసులే అని మరోసారి రుజువైంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సైతం ఈ సినిమాను రెండుసార్లు చూశాడట. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని ఆయన తహతహలాడిపోతున్నాడట. ఈ విషయాన్ని కట్టప్ప పాత్రధారి సత్యరాజ్‌ను ఫోన్ చేసి మరీ అడిగాడట. అంతే కాదు.. ఈ మధ్య ఎవరో ఇండియన్ సినిమా గురించి అడిగితే.. ‘బాహుబలి’ గురించి చెప్పాడట షారుఖ్. ఇంకా ‘బాహుబలి’ గురించి షారుఖ్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడట.

‘‘అంతర్జాతీయంగా మన సినిమా స్థాయిని బాహుబలి లాంటి చిత్రాలు పెంచుతాయి. పది రోజుల క్రితం ఓ వ్యక్తి ఇండియన్‌ సినిమా అంటే ఏంటని నన్నడిగాడు. అప్పుడు నేను ఉదాహరణగా ‘బాహుబలి’ గురించి చెప్పా. ప్రతి సినిమా ‘బాహుబలి’ తరహాలో ఉండాలనడంలేదు. ఐతే భవిష్యత్‌ భారతీయ సినిమాలకు ‘బాహుబలి’ని ఓ రోడ్‌ మ్యాప్‌ కింద నేను భావిస్తాను. ఈ సినిమాను నేను రెండుసార్లు చూశా. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నాతో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో నటిస్తున్న సమయంలోనే సత్యరాజ్‌ ‘బాహుబలి’లో కట్టప్పగా నటిస్తున్నారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ రిలీజైంది. తర్వాత నేను ‘దిల్‌ వాలే’ చేశా. అదీ రిలీజైంది. ఇప్పుడు ‘రయీస్‌’ కూడా వచ్చేసింది. కానీ సత్యరాజ్‌ గారు మాత్రం ‘బాహుబలి’ చేస్తూనే ఉన్నారు. నటీనటులు.. దర్శక నిర్మాతలు.. టెక్నీషియన్లు అంకితభావంతో ఆ సినిమా కోసం పని చేశారు. అందువల్లే ఫలితం కూడా ఆ స్థాయిలో ఉంది. ఇటువంటి పాత్‌ బ్రేకింగ్‌ సినిమాలో నటించమని ఎవరైనా నన్ను అడిగితే తప్పకుండా నటిస్తా. ఇంతకీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అని సత్యరాజ్ గారికి ఫోన్ చేసి అడిగాను. ఆయన నవ్వేసి ఊరుకున్నారు’’ అని షారుఖ్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News