తొలి షూటింగ్ షురూ: ఇండస్ట్రీలో మొదలైన సందడి

Update: 2020-06-13 08:10 GMT
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించగా సినీ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. దాదాపు మూడు నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇటీవల షూటింగులకు అనుమతి ఇచ్చింది. షూటింగ్ లపై విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించింది. వాటికి అనుగుణంగా షూటింగ్ చేయాల్సిందే. వైరస్ వ్యాప్తి చెందవద్దనే ప్రభుత్వ ఉద్దేశం. అనుమతులు జారీ చేసిన తర్వాత తొలి షూటింగ్స్ మొదలయ్యాయి. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ టీవీ సీరియల్ షూటింగ్ శుక్రవారం జరిగింది. పూర్తి జాగ్రత్తల మధ్య షూటింగ్ పూర్తి  చేసుకుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సీరియల్ షూటింగ్ మొదలుపెట్టింది. షూటింగ్ సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. లొకేషన్ లోకి వచ్చే సిబ్బంది ఒక డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ నుంచి నడిచి వెళ్లేలా ఏర్పాటు చేశారు. మాస్కులు, శానిటైజర్లు, మాస్కులు, గ్లోవ్స్ అందుబాటులో ఉంచారు. లొకేషన్, షూటింగ్ కు వాడే పరికరాలు పూర్తిగా శానిటైజ్ చేసి ఉంచారు. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ఇతర సిబ్బందికీ థర్మల్ స్క్రీనింగ్ చేసే అనుమతించారు. మేక్ అప్ సిబ్బంది పీపీఈ సూట్లు ధరించే మేక్ అప్ చేశారు. ఇక భౌతిక దూరం విధిగా పాటించారు. మొత్తంగా కేవలం 20-30 మంది తోనే రోజంతా షూటింగ్ జరిపారని తెలిసింది.

లాక్ డౌన్ సమయంలో ఈ సీరియల్ ప్రసారం నిలిపి వేశారు. షూటింగ్స్ లేక ఎపిసోడ్స్ లేవు. ఇప్పుడు షూటింగ్ మొదలవడంతో త్వరలోనే  టీవీలో సీరియల్ ప్రసారం  మొదలుకానుంది. అయితే చిత్ర పరిశ్రమలో ఇంకా షూటింగ్స్ పెద్దగా మొదలుకాలేదు. కొన్నాళ్లు వేచిచూసే ధోరణిలో ఉన్నారు.
Tags:    

Similar News