సిగరెట్, మందు.. విష్ణు హీరోయిన్ రెస్పాన్స్ ఏంటి?

తనకు వచ్చిన తెలుగులో అవి రియల్ కావంటూ.. రియల్ కాదంటూ చెప్పుకొచ్చారు. మందు బదులు వాటర్ తాగానని, సిగరెట్ అంటే హెర్బల్ సిగరెట్ చేసి ఇచ్చారని చెప్పారు.;

Update: 2026-02-28 10:32 GMT

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు లీడ్ రోల్ లో నటించిన విష్ణు విన్యాసం మూవీ రీసెంట్ గా రిలీజవ్వగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించి తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. మనీషాగా మెప్పించింది. మూవీలో కడుపుబ్బా నవ్వించిన శ్రీవిష్ణుకు పోటీగా ఆమె కూడా మూవీలో తన కామిక్ టైమింగ్ తో నవ్వించడం విశేషమని చెప్పాలి.

విష్ణుతో నయన్ సారిక కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అయితే సినిమాలోని కొన్ని సీన్స్ లో ఆమె.. సిగరెట్ తాగుతూ, మందు కొడుతూ కనిపించారు. ఇప్పుడు ఆ సీన్స్ పై ఆమె.. మూవీ సక్సెస్ మీట్ లో రెస్పాండ్ అయ్యారు. రీసెంట్ గా మేకర్స్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా.. అందులో నయన సారిక సందడి చేశారు. ఫుల్ జోష్ లో.. చాలా యాక్టివ్ గా కనిపించారని చెప్పాలి.

ఆ సమయంలో సినిమాలో సిగరెట్ తాగారు.. మందు కొట్టారు.. ఎలా అనిపించింది? అంటూ ఓ మీడియా ప్రతినిధి ఫన్నీ క్వశ్చన్ అడ్డగా.. నయన్ సారిక నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు. తనకు వచ్చిన తెలుగులో అవి రియల్ కావంటూ.. రియల్ కాదంటూ చెప్పుకొచ్చారు. మందు బదులు వాటర్ తాగానని, సిగరెట్ అంటే హెర్బల్ సిగరెట్ చేసి ఇచ్చారని చెప్పారు.

ఇక నయన్ సారిక విషయానికొస్తే.. మహారాష్ట్రకు చెందిన ఆ బ్యూటీ మిస్టేక్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించగా.. గం గం గణేశా మూవీతో హీరోయిన్ గా ఆమె మారారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఆ మూవీలో శ్రుతిగా యాక్ట్ చేశారు. అయితే క, ఆయ్ సినిమాలతో ప్రేక్షకులకు మరింతగా చేరువైంది.

ఆ రెండు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుని బిజీ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తూ, గలగలా తెలుగు మాట్లాడుతుండడం గమనార్హం. ఇప్పుడు శ్రీవిష్ణుతో కలిసి విష్ణు విన్యాసంలో నటించగా.. చిన్న సినిమాలతో మంచి పేరు తెచ్చుకుని విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఇప్పుడు తెలుగులో మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో ఒకరైన సంగీత్ శోభన్ సరసన రాకాసా మూవీలో యాక్ట్ చేస్తోంది. త్వరలో ఆ మూవీ థియేటర్స్ లో విడుదల కానుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తుండగా.. రాకాసాతోపాటు కన్నడలో ఒక సినిమా చేస్తున్నట్లు ఆమె రీసెంట్ గా తెలిపింది. మరి అప్ కమింగ్ మూవీలతో నయన్ సారిక ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.


Tags:    

Similar News