ఏకంగా 18 కొత్త ప్రాజెక్టులు.. ఈటీవీ విన్ 3.O ప్లాన్ ఏంటి?

తెలుగు ఓటీటీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈటీవీ విన్ మరో మైల్ స్టోన్ అందుకుంది.;

Update: 2026-02-28 11:51 GMT

తెలుగు ఓటీటీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈటీవీ విన్ మరో మైల్ స్టోన్ అందుకుంది. స్టార్ట్ అయిన మూడు సంవత్సరాల వ్యవధిలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో దూసుకెళ్లిన ఆ ప్లాట్ ఫామ్.. ఇప్పుడు విన్ 3.0 అప్ గ్రేడ్ వెర్షన్ తో కొత్తగా మారింది. స్పీడ్ స్ట్రీమింగ్‌, హై వీడియో క్వాలిటీ, యూజర్స్ కు మరింత మంచి ఎక్స్పీరియన్స్ అందించాలనే లక్ష్యంతో సరికొత్త వెర్షన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.



 


మూడు ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈటీవీ విన్ తన 2026- 2027 కంటెంట్ క్యాలెండర్‌ ను గ్రాండ్ గా రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఏకంగా 16 థియేట్రికల్ చిత్రాలు, రెండు ఒరిజినల్ వెబ్‌సిరీసులను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విన్ జాతర పేరుతో కొత్త కంటెంట్ లైనప్‌ ను పరిచయం చేసింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు, వెబ్ సిరీసులు తీసుకురానుంది.

ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాల నుంచి థ్రిల్లర్ లవర్స్ నచ్చే సస్పెన్స్ వెబ్‌సిరీస్‌ల వరకు విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు థియేటర్లకు పరిమితమైన పెద్ద సినిమాలు కూడా డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ఈటీవీ విన్ ప్రత్యేకతగా నిలిచింది. నార్మల్ మూవీ ఎక్స్పీరియన్స్ ను, డిజిటల్ బెనిఫిట్స్ తో కలిపి అందించాలనే ప్రయత్నం క్లియర్ గా కనిపిస్తోంది.

అందుకే ప్రతి నెలా కొత్త కంటెంట్‌ ను అందిస్తూ సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకునే విధంగా ప్లాన్ రూపొందించింది. ఆ కొత్త ప్రాజెక్టుల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న నటీనటులతో పాటు యంగ్ టాలెంట్ కు కూడా ఛాన్సులు కల్పించడం గమనార్హం. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, హీరో ఆది సాయి కుమార్ తో పాటు కొత్త దర్శకులు, టెక్నీషియన్లకు మంచి ఛాన్సులు అందిస్తోంది.

థియేటర్లలో అవకాశాలు దొరకని కొత్త కథలు, ప్రయోగాత్మక కాన్సెప్ట్‌ లకు ఈటీవీ విన్ ఒక లాంచ్‌ ప్యాడ్‌ గా మారిందని చెప్పాలి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే మల్టీ లాంగ్వేజ్ మోడ్ లోకి యాప్ అప్డేట్ అవ్వడం! తెలుగు కథలకు నేషనల్, ఇంటర్నేషనల్ రేంజ్ లో క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇతర భాషల్లో కూడా కంటెంట్ అందించేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

సాంకేతికంగా కూడా ఈటీవీ విన్ పెద్ద మార్పులు చేసింది. డాల్బీ విజన్, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో హై క్వాలిటీ వీడియో, థియేటర్ రేంజ్ ఆడియో క్వాలిటీని యూజర్స్ కు అందిస్తోంది. ఇంట్లోనే థియేటర్ ఫీల్ కలిగించేలా కంటెంట్‌ ను అందించడమే లక్ష్యంగా అప్ గ్రేడ్ చేసింది. ఏదేమైనా రీజనల్ ఓటీటీ యాప్‌ గా ప్రారంభమైన ఈటీవీ విన్, ఇప్పుడు వరల్డ్ క్లాస్ స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్‌ గా ఎదుగుతోంది. విన్ 3.Oతో తెలుగు ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తూ డిజిటల్ యుగంలో ఈటీవీ విన్ తన సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తోంది.

Tags:    

Similar News