• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘తలైవి’కి సీక్వెల్ రెడీ...

‘తలైవి’కి సీక్వెల్ రెడీ అవుతోందట

By - Tupaki Desk
Update: 2021-09-23 17:30 GMT
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'తలైవి' సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక చాలా కాలంలో పాటు విడుదల ఆపాల్సి వచ్చింది. అందుక్కారణం కరోనా మహమ్మారి. ఇలా ఆగి ఆగి చివరికి ఇటీవలే వినాయక చవితి కానుకగా సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి చేదు అనుభవం ఎదురైంది. సినిమా బాగుందని విమర్శకులు ప్రశంసించినా, మంచి రివ్యూలు వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూసేందుకు అంతగా ఆసక్తి ప్రదర్శించలేదు. తమిళంలో ఓ మోస్తరుగా ఆడిన 'తలైవి'.. తెలుగు, హిందీ భాషల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్‌కు మంచి ఆఫర్లు వచ్చినా టెంప్ట్ అవకుండా ఇన్ని నెలలు ఆగి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు విష్ణువర్ధన్ ఇందూరి.

కాకపోతే నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే సినిమాకు లాభాలు వచ్చేయడంతో థియేట్రికల్ రెవెన్యూ విషయంలో బాధ పడాల్సిన అవసరం లేకపోయింది. మొత్తానికి 'తలైవి' సినిమా ఆయనకు మిశ్రమానుభూతులను మిగిల్చింది. ఇంతటితో ఈ సినిమా కథ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ తాజా సమాచారం ఏంటంటే.. 'తలైవి'కి సీక్వెల్ రాబోతోందట. జయలలి నట జీవితంతో పాటు రాజకీయ ప్రయాణంలో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే వరకే ఈ సినిమాలో చూపించడం తెలిసిందే. దీంతో కథ అసంపూర్తిగా ఉందని, కన్వీనియెంట్‌గా బయోపిక్‌ను ముగించారని.. ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన ఆరోపణలు, ఎదుర్కొన్న వివాదాల ప్రస్తావనే లేకుండా పోయిందని.. ఆమె జీవితాన్ని తెరపై ముగించలేదని విమర్శలు వచ్చాయి. ఐతే అన్నీ తెలిసే ఈ కథను ఇలా కన్వీనియెంట్‌గా ముగించారని అనుకున్నారు. కానీ సీక్వెల్ తీయడం ద్వారా ఈ కథను ముగించడానికి చిత్ర బృందం చూస్తోందట. థియేటర్లలో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ నిర్మాతకు లాభాలు రావడంతో విజయేంద్ర ప్రసాద్‌తో సీక్వెల్ కోసం స్క్రిప్టు రెడీ చేయిస్తున్నారని.. 'తలైవి' కథ ముగిసిన దగ్గర్నుంచి జయలలిత జీవిత చరమాంకం వరకు ఇందులో చూపించబోతున్నారని అంటున్నారు.
Tags:    
  • Kangana Ranaut 
  • Thalaivi 
  • Bollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS