బాహుబలి సింగర్ కి జైలు

Update: 2018-03-17 04:16 GMT
ఫేమస్ పంజాబీ సింగర్ దలేర్ మెహంది పేరు చెప్పగానో ఎన్నో హిట్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. రెండు దశాబ్దాల క్రితం బోలో తారారార.. హో జాయేగీ బల్లేబల్లే అంటూ అంటూ ఆయన పాడిన పాటలు దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపాయి. ఇన్నేళ్లయినా ఆయన గొంతులో జోష్ అలాగే ఉండటం విశేషం. హిందీ.. తెలుగుతో పాటు అనేక భాషల్లో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నదలేర్ మెహందికి  పంజాబ్ లోని పాటియాల కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

దలేర్ మెహందిపై ఉన్న ఈ కేసు ఇప్పటిది కాదు. దలేర్..  అతడి తమ్ముడు షంషేర్ కలిసి విదేశాలకు పంపిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేశారని 2003లో కేసు నమోదైంది. దాదాపు 14 ఏళ్లగా ఈ కేసు విచారణలోనే ఉంది. ఎట్టకేలకు ఈ కేసులో పాటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. దలేర్.. అతడి తమ్ముడు కలిసి కొందరిని ట్రూప్ మెంబర్లుగా అమెరికా తీసుకెళ్లి వాళ్లను అక్కడ వదిలేసి రావడం నిజమేనని తేల్చింది. వాళ్లిద్దరికి రెండేళ్ల జైలు విధించింది. వెంటనే రూ. 10 వేలు కోర్టులో చెల్లించి దలేర్ బెయిల్ పై బయటికొచ్చేశాడు.  

కోర్టు నుంచి వచ్చాక తన అభిమానులను కోసం దలేర్ మెహంది ఓ ట్వీట్ కూడా పెట్టాడు. ‘‘ఈ తీర్పు బాధ కలిగించింది. కానీ భగవంతుడిపై నాకు నమ్మకం ఉంది. దీనిపై సెషన్స్ కోర్టుకు వెళతాను. ఈసమయంలో నాకు సపోర్ట్ గా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ లో తన ఫీలింగ్ పంచుకున్నాడు.  అప్పట్లో యమదొంగ సినిమాలో రబ్బరు రబ్బరు గాజులు పాట.. ఈమధ్యనే బాహుబలి-2 సినిమాలో సాహోరే బాహుబలి అంటూ వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ దలేర్ గొంతు నుంచి వచ్చినవే.


Tags:    

Similar News