• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాతీయ అవార్డ్ ఓటీటీ...

జాతీయ అవార్డ్ ఓటీటీ సినిమా థియేట‌ర్ల‌కు..

By - Tupaki Desk
Update: 2022-10-23 16:29 GMT
హిట్ట‌యిన సినిమాని లేదా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు స‌హా అవార్డులు గెలుచుకున్న సినిమాల‌పై జ‌నాల్లో క్యూరియాసిటీ ఎప్పుడూ ఉంటుంది. అగ్ర హీరోల క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పాటు వీటిపైనా కొంత క్యూరియాసిటీ షురూ!

ఇటీవలి కాలంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ - జ‌ల్సా.. ఎన్టీఆర్ ఆది- మహేష్ పోకిరి- బాలయ్య చెన్నకేశవ రెడ్డి- ప్రభాస్ బిల్లా చిత్రాలను థియేటర్లలో విడుదల చేయగా అభిమానులు మ‌ళ్లీ ఆద‌రించారు. ఈ ట్రెండ్ తదుపరి స్థాయికి చేరుకుంటోంది. ఇప్పుడు ఓటీటీ సినిమా తిరిగి థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌డ‌మే ఆశ్చ‌ర్యక‌రం.

2020 కోవిడ్ మహమ్మారి లాక్ డౌన్ ను నిర్ధారిస్తున్న సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం `కలర్ ఫోటో` ఇప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌డం కొత్త ట్రెండ్ అని చెప్పాలి. యూట్యూబర్ సుహాస్ -షార్ట్ ఫిల్మ్ ఫేమ్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో చాయ్ బిస్కెట్ ఫేమ్ సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. అలాగే 68వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు సినిమా అవార్డును కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమా విడుదలై 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

19 నవంబర్ 2022న `కలర్ ఫోటో` మొదటిసారిగా బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతోంది. ఆశ్చర్యకరంగా ఈ చిత్రంతో నాయ‌కానాయిక‌ల‌కు మంచి గుర్తింపు ఇప్ప‌టికే ద‌క్కింది. థియేట్రిక‌ల్ రిలీజ్ తో మ‌రింత గుర్తింపు ద‌క్కుతుంద‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌తిభావంతులైన‌ సుహాస్- చాందిని వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్నారు. సుహాస్ సినిమాలేవీ ఇంకా రాక‌పోయినా కానీ.. సమ్మతమే చిత్రంతో చాందిని అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఇది పెద్ద‌గా ఆడ‌లేదు. అయినా ఇప్పుడు  సంచలనాత్మక OTT చిత్రం ఇప్పుడు మ‌రోసారి థియేట‌ర్ల‌లో అంద‌రినీ అల‌రించ‌నుంది. మిస్స‌య్యాం అనుకున్న‌వాళ్లు మ‌ళ్లీ చూడాల్సిన సినిమాగా క‌ల‌ర్ ఫోటో గురించి టాక్ ఉంది.
Tags:    
  • Colour Photo 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

Copyright @2026

Powered by Blink CMS