భామల్లో డైల‌మా! సీనియ‌ర్లు అలా.. జూనియ‌ర్లు ఇలా?

Update: 2021-08-07 06:30 GMT
కొత్తొక వింత పాతొక రోత‌! హీరోయిన్ల కెరీర్ మ్యాట‌ర్ లో ఇది మ‌రీ సూట‌బుల్. ఏ భాష‌లోనైనా హీరోయిన్ల విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు దిగుమ‌తి త‌ప్ప‌నిస‌రి. అదీ ఇటీవ‌లి కాలంలో ఈ ఒర‌వ‌డిలో మ‌రింత స్పీడ్ పెరిగింది. కొత్త ముఖాల‌కే ఎక్కువ‌గా హీరోలు ఓకే చెబుతున్నారు. అగ్ర హీరోలంతా కాస్త పేరున్న హీరోయిన్ల‌వైపు చూస్తుంటే... మీడియం రేంజ్ హీరోలు మాత్రం అప్ప‌టికే ఇరుగు పొరుగు భాష‌ల్లో ఫేం ఉన్న భామ‌ల‌వైపు మొగ్గు చూపిస్తున్నారు. స్టార్ హీరోల‌కు హీరోయిన్ క్రేజ్ తో సంబంధం లేదు. కానీ సేఫ్ సైడ్ గా రెండింటీని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నారు. అదే మీడియం రేంజ్ హీరోలైతే హీరోయిన్ల‌కు ఉన్న ఛ‌రిష్మాని ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు. అలా న‌వ‌త‌రం హీరోల‌తో న‌టిస్తూ ఇటీవ‌లి కాలంలో బాగా ఫోక‌స్ అవుతున్న భామ‌లున్నారు. రెగ్యుల‌ర్ గా మీడియం రేంజ్ హీరోల‌తో సినిమాలు చేస్తూ తారా స్థాయికి చేరుతున్నారు.

న‌భా న‌టేష్- నిధి అగ‌ర్వాల్- పాయ‌ల్ రాజ్ పుత్ త‌దిత‌ర భామామ‌ణులు చిన్న సినిమాల‌తోనే కెరీర్ ప్రారంభించి అగ్ర హీరోల రేంజ్ కి ఎదుగుతున్నారు. అయితే స్వ‌యంకృతాప‌రాధంతో కొన్ని త‌ప్పులు చేసిన భామ‌లు ఈ జాబితాలో ఉన్నారు. రేంజ్ ని మించి పారితోషికం కోట్ చేయ‌డం వ‌ల్ల వ‌చ్చిన అవ‌కాశాల్ని కూడా చేజార్చుకుంటున్నారు. వ‌చ్చిన ఫేమ్ ని సైతం కోల్పోతున్నార‌నే విమ‌ర్శ ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ భామ‌లు చేస్తోన్న సినిమాలు ఓ సారి ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిసాయి.

`న‌న్ను దోచుకొందువ‌టే` సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన న‌భాన‌టేష్ అటుపై `ఇస్మార్ట్ శంక‌ర్` హిట్ తో యూత్ లో మంచి క్రేజీ బ్యూటీగా వెలిగిపోయింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా కొన్ని అవ‌కాశాలు అందుకుంది. కానీ అమ్మ‌డి కెరీర్ ఒక్క‌సారిగా డ‌ల్ అయింది. ప్ర‌స్తుతం `మాస్ట్రో` లో న‌టిస్తోంది. మాస్ట్రో రిలీజ్ కి రెడీగా ఉంది. కొత్తగా అవ‌కాశాలైతే చేతిలో లేవు. ఈ నేప‌థ్యంలో హాట్ హాట్ ఫోజుల‌తో వ‌లపు బాణాలు వేసే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అలాగే స‌వ్య‌సాచి సినిమాతో తెరంగేట్రం చేసిన నిధి ఆరంభంలో అద‌ర‌గొట్టింది. కానీ అటుపై స్పీడ్ ఒక్క‌సారిగా త‌గ్గింది. ప్ర‌స్తుతం `హీరో`.. `హ‌రి హ‌ర వీర మ‌ల్లు` చిత్రాల్లో న‌టిస్తోంది త‌ప్ప కొత్త అవ‌కాశాలేవీ చేతిలో లేవు.

ఇక `ఆర్.ఎక్స్ -100` సినిమాతో క‌థానాయిక‌గా ప్ర‌వేశించిన పాయ‌ల్ రాజ్ పుత్ వ‌స్తూనే ఓ ఊపు ఊపేసింది. ఒకే ఏడాదిలో ఏకంగా ఆరు సినిమాలు చేసి షాక్ ఇచ్చింది. కానీ ఆ స్పీడ్ ఎంతో కాలం కొన‌సాగ‌లేదు. ప్ర‌స్తుతం పాయ‌ల్ చేతిలో `కిరాత‌క` అనే ఒక్క సినిమా మాత్ర‌మే చేతిలో ఉంది. అయితే పాయ‌ల్ కి అవ‌కాశాలు త‌గ్గ‌డం వెనుక మ‌రో కార‌ణం కూడా బ‌లంగా వినిపిస్తుంది. `మీటూ ఉద్య‌మం`లో భాగంగా టాలీవుడ్ నిర్మాత‌ల‌పై కొన్ని నెగిటివ్ కామెంట్లు చేసింది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ ఆమెని ప‌క్క‌న‌పెట్టింద‌నే ఆరోప‌ణ కూడా ఉంది. అలా పాయ‌ల్ ప్ర‌ధానంగా వెనుక‌బ‌డింద‌న్న‌ది హైలైట్ అయింది.

ఇక సీనియ‌ర్ హీరోయిన్లు అయిన అనుష్క‌.. కాజ‌ల్ అగ‌ర్వాల్.. త‌మ‌న్నా.. కీర్తి సురేష్‌.. ర‌కుల్ ప్రీత్ సింగ్.. స‌మంత లాంటి వారు మీడియం రేంజ్ హీరోల‌కు స‌రిప‌డే భామ‌లు కాదు. ఇద్ద‌రి మ‌ధ్యా వ‌య‌సు వ్య‌త్యాసం కూడా ఎక్కువ‌గానే ఉంది. ఆ కార‌ణంగా వీళ్లంతా కంటెంట్ బేస్డ్ సినిమాలతో పాటు.. సీనియ‌ర్ హీరోల వైపే చూడాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఏజ్ ఫ్యాక్ట‌ర్ తో పాటు పాత‌బ‌డ‌డం అనేది సీనియ‌ర్ల‌కు కొంత ఇబ్బందిక‌రంగానే మారుతోంది. ఇక నేటిత‌రం క‌థానాయిక‌ల వెల్లువ‌తో పోటీ కూడా తీవ్ర‌మైంది.




Tags:    

Similar News