మురుగదాస్ కి హీరో దొరికాడోచ్..!

ఒకప్పుడు సౌత్ స్టార్ డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు మురుగదాస్. ఆయన తీసిన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయి.;

Update: 2026-01-22 18:30 GMT

ఒకప్పుడు సౌత్ స్టార్ డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు మురుగదాస్. ఆయన తీసిన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయి. ఐతే ఇప్పుడు మురుగదాస్ ఏమాత్రం ఫాం లో లేడు. అటు బాలీవుడ్ లో ఆయన చేసిన సినిమాలు ఏది వర్క్ అవుట్ అవ్వట్లేదు. తమిళ్ లో కూడా చివరగా చేసిన మదరాసి కూడా పెద్దగా కిక్ ఇవ్వలేదు. సల్మాన్ తో సికిందర్ సినిమా చేసిన మురుగదాస్ ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది.

శివ కార్తికేయన్ తో మదరాసి..

ఇక తమిళంలో వరుస సక్సెస్ లతో ఫాం లో ఉన్న శివ కార్తికేయన్ తో మురుగదాస్ చేసిన మదరాసి ఆశించిన రేంజ్ అందుకోలేదు. ఒకప్పుడు సూపర్ హిట్ లు అందుకున్న మురుగదాస్ ఇప్పుడు కనిపించట్లేదని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఐతే మురుగదాస్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో మొదలైంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మురుగదాస్ తర్వాత సినిమా హీరో దొరికాడట.

కోలీవుడ్ స్టార్ శింబుతో మురుగదాస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. శింబు కూడా ఆఫ్టర్ గ్యాప్ మళ్లీ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో వస్తున్నాడు. వడ చెన్నై యూనివర్స్ లో భాగంగా వెట్రిమారన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది. ఇవి రెండు కాకుండా ఇప్పుడు మురుగదాస్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు.

శింబుతో డిఫరెంట్ గా..

శింబు తో మురుగదాస్ ఈ కాంబో కచ్చితంగా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. మురుగదాస్ స్టామినా ఏంటన్నది తెలిసినా కూడా ఈమధ్య ఆయన చేస్తున్న సినిమాలు ఏవి ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేదు. ఐతే శింబుతో చేస్తున్న సినిమా మాత్రం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. మురుగదాస్ తిరిగి ఫాం లోకి వస్తే మాత్రం కచ్చితంగా ఆయన ఫ్యాన్స్ కి సూపర్ హ్యాపీగా ఉంటుంది.

యువ టాలెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్న ఈ టైంలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మురుగదాస్ లాంటి వాళ్లు వెనకపడటం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఐతే ఈ డైరెక్టర్స్ కి మళ్లీ ఒక్క సూపర్ హిట్ పడితే మాత్రం వారి స్టామినా ప్రూవ్ అవుతుంది.

ముఖ్యంగా మురుగదాస్ మార్క్ స్టోరీ టెల్లింగ్, మేకింగ్ తో ఒక అదిరిపోయే కథ సెట్ అయితే మాత్రం ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతారు. శింబుతో మురుగదాస్ చేసే సినిమా అదే అవ్వాలని తమిళ ఆడియన్స్ కోరుతున్నారు. శింబు కూడా ఇన్నాళ్లకు వరుసగా క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకుంటూ మళ్లీ తిరిగి కెరీర్ మీద ఫోకస్ తో ఉన్నాడు. శింబుకి ఎలాగు తెలుగులో కూడా ఫాలోయింగ్ ఉంది సో ఆయన చేస్తున్న సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News