లక్కీ ఛాన్స్ అందుకోబోతున్న స్టార్ హీరో.. నిజమైతే రికార్డ్స్ బ్రేక్!
సౌత్ ఇండస్ట్రీతో పోల్చుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ మొదలైంది.;
సౌత్ ఇండస్ట్రీతో పోల్చుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే ఎన్నో బయోపిక్ లు తెరపైకి వచ్చి సంచలనం సృష్టిస్తుంటే.. ఇప్పుడు మరో కొత్త బయోపిక్ తెరపైకి రానున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. ఈమధ్య కాలంలో బయోపిక్ చిత్రాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ మంచి పేరు సొంతం చేసుకున్న విక్కీ కౌశల్ కి కూడా ఉక్కు మనిషిగా పేరు దక్కించుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ బయోపిక్ లో నటించే అవకాశం లభించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు అటు సినీ వర్గాలలో.. ఇటు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో బాగా వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. భారతదేశ ఉక్కు మనిషిగా పిలవబడే సర్దార్ వల్లభాయ్ పటేల్.. స్వాతంత్రం తరువాత 500కు పైగా సంస్థానాలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1947 - 1950 మధ్యకాలంలో భారత దేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా, హోం మంత్రిగా కూడా పనిచేశారు. ఇలాంటి నేపథ్యంలోనే ఈయన బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి ఒక ప్రధాన నిర్మాణ సంస్థ స్క్రిప్ట్ ను కూడా ఖరారు చేసిందట. అందులో భాగంగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రను పోషించడానికి విక్కీ కౌశల్ ను తీసుకోవాలని ఆ చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ మీడియా కథనాలలో జోరుగా వినిపిస్తోంది. అయితే అటు నటుడు నుంచి కానీ ఇటు ఏ స్టూడియో నుండి ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోవడంతో అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువబడునున్నట్లు సమాచారం. ఇక విక్కీ కౌశల్ విషయానికి వస్తే సర్దార్ ఉదమ్, సామ్ బహదూర్ వంటి ప్రముఖుల పాత్రలలో విక్కీ నటన చాలా అద్భుతమని, ఇప్పటికే ఆ చిత్రాలు నిరూపించాయి. ఒకవేళ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాజెక్టు గనుక ముందుకు సాగితే.. ఈ చిత్రం విక్కీ కౌశల్ కెరియర్లో మైలురాయిగా మిగులుతుంది అనడంలో సందేహం లేదు.
అంతేకాదు బయోపిక్ తో పాటు దేశభక్తి చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే నటుడిగా విక్కీ కౌశల్ స్థిరపడిపోతారని మరి కొంతమంది విమర్శకులు కూడా భావిస్తున్నారు. విక్కీ కౌశల్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ , భావోద్వేగ లోతు, డిమాండ్ ఉన్న పాత్రలకి కచ్చితంగా సరిపోతాడని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ కథ తెరపైకి వస్తే.. అందులో విక్కీ కౌశల్ నటిస్తే గనుక కచ్చితంగా విక్కీ కౌశల్ మరో స్టార్ హోదాను దక్కించుకుంటారు అనడంలో సందేహం లేదు.. ఇక ఏం జరుగుతుంది అనే విషయం మన ముందు తెలుస్తుంది .