షార్ట్ ఫిల్మ్స్ కి రకరకాల నేమ్స్ పెట్టి అమ్మేస్తున్నారా...?

Update: 2020-09-09 12:10 GMT
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే కొద్దీ 'సినిమా' అంటే అర్థం మారిపోతూ వస్తోంది. సినీ రంగంలో వస్తున్న మార్పుల వలే క్రమక్రమంగా సినిమా నిడివి కూడా మారుతూ వచ్చింది. ఒకప్పుడు నాలుగు గంటలు మూడు గంటల నిడివితో సినిమాలు ఉండేవి. థియేటర్ లో ప్రేక్షకుడిని అంతసేపు కూర్చోబెట్టడం కష్టంగా మారిన క్రమంలో సినిమా నిడివి రెండున్నర గంటలకు కుదిస్తూ వచ్చారు. అయితే రాను రాను రెండు గంటలు నడిచే సినిమాలు వచ్చేసాయి. ఈ క్రమంలో షార్ట్ ఫిల్మ్స్ అనే చిన్న చిత్రాలు వచ్చాయి. పేరులో ఉన్నట్లే ఈ లఘు చిత్రాలు తక్కువ నిడివితో.. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పే సినిమాలుగా వస్తున్నాయి. అయితే కరోనా మహమ్మారి వల్ల సినీ ఇండస్ట్రీలో నెలకొని యున్న పరిస్థితుల్లో ఏటీటీ అనే కొత్త టెక్నాలజీని తీసుకొస్తూ రామ్ గోపాల్ వర్మ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ కూడా తక్కువ నిడివి ఉండే సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు. దీనికి శ్రేయాస్ మీడియా గ్రూప్ వారు తోడై 'శ్రేయాస్ ఈటీ' అనే యాప్ ని క్రియేట్ చేసి ఈ చిన్న సినిమాలను పే పర్ వ్యూ విధానంలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రేయాస్ మీడియా వారు మరో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

కాగా మీ విరామ సమయంలో మిమ్మల్ని అలరించండానికి మొట్టమొదటిసారిగా 'స్నాక్ ఫిల్మ్స్' అనే సినిమాలను తీసుకొస్తున్నట్లు శ్రేయాస్ మీడియా ప్రకటించింది. ఎనీ టైం షో టైం అంటూ కేవలం 10 నిమిషాల నిడివి కలిగిన సినిమాలను శ్రేయాస్ ఈటీ ఏటీటీలో అప్లోడ్ చేయనున్నారు. అంటే చిన్న చిన్న క‌థ‌ల్ని 10 నిమిషాల సినిమాలుగా మ‌ల‌చి విడుద‌ల చేయ‌బోతున్నారన్నమాట. అయితే 'స్నాక్ ఫిల్మ్స్' అని కొత్త నేమ్స్ పెట్టి అప్లోడ్ చేసేది మనకు ఎప్పటి నుంచో తెలిసిన లఘు చిత్రాలనే కదా అని కామెంట్స్ చేస్తున్నారు. యూట్యూబ్ లో అనేక రకాల షార్ట్ ఫిలిమ్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్ని సినిమాని మించి ఆదరణ తెచ్చుకున్నవి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కే కొత్త పేర్లు పెట్టి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారని ఓటీటీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News