కరోనా అయితే నాకేంటి అంటున్న స్టార్ డైరెక్టర్

Update: 2020-03-21 01:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. సామన్య ప్రజానీకం దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ కరోనా దెబ్బకు ఇల్లు దాటాలంటేనే పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు సైతం తమ షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఇళ్లకే పరిమితమై కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. నేపథ్యంలో సెలబ్రెటీలు క‌రోనా విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని త‌మ అభిమానుల‌కు సూచిస్తున్నారు. త‌మ వంతు సామాజిక బాధ్య‌త‌గా హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. అయితే ఓ స్టార్ డైరక్టర్ మాత్రం కరోనాకి భయపడకుండా తన మూవీ షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సున్నితమైన కథలను తన స్టైల్ లో చూపించే శేఖర్ కమ్ముల.

వివరాల్లోకి వెళ్తే అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'ఫిదా' లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నారట. ఈ క్రమంలో కరోనాను పట్టించుకోకుండా ఆయన తన సినిమా షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహబూబ్‌నగర్‌లో జరుగుతుండగా, నాగ చైతన్య, సాయి పల్లవిలపై చిత్రీకరణను కొనసాగిస్తున్నారు. అయితే కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకునే షూటింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ లోని ఒక సభ్యుడు తెలియజేసాడు.
Tags:    

Similar News