ఫిదా సీక్వెల్ కాదు బాబోయ్!!

Update: 2017-08-16 11:27 GMT
ఇప్పుడు శేఖర్ కమ్ముల ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తనను చాలామంది 'ఫిదా' లాంటి సినిమాలు చేస్తూ ఉండు అన్నారట. కొంతమంది స్టార్ హీరోలు.. కొందరు స్టార్ ప్రొడ్యూసర్లు అయితే.. సేమ్ అలాంటి సినిమానే కావాలని అంటున్నారట. ఇంతకీ శేఖర్ ఎటువంటి సినిమాను తీయబోతున్నాడు? నిజంగానే ఫిదా సినిమా సీక్వెల్ తీస్తాడా? అలా తీస్తే కిక్ వస్తుందా?

యాక్చువల్లీ మనోడు 'ఫిదా' సినిమాను కూడా ఎక్కవగా ఆనంద్ అండ్ గోదావరి తరహాలోనే రాశాడు. కాకపోతే ఫ్రెష్‌ విజువల్స్ తో కొత్త రకం పెర్ఫామెన్సులు చూసేసరికి అందరికీ బాగా నచ్చేసింది. కాని మళ్లీ అలాంటి ప్రయత్నమే చేస్తే మాత్రం రొటీన్ అయిపోతుంది. అలాగని శేఖర్ కమ్ముల ఇప్పుడు కహానీ రీమేక్ తరహాలో క్రైమ్ కథలను చేసినా ఆడదు. అందుకే దిల్ రాజు మనోడ్ని మరో ఫ్యామిలీ డ్రామా రాసుకో కాని.. ఈసారి ఇంకోటేదైనా యాంగిల్ డీల్ చెయ్యి అని చెప్పాడట. ఫిదా సినిమాను సైన్ చేసినప్పుడే దిల్ రాజుకు మరో సినిమా చేస్తానని మాటివ్వడంతో.. ఇప్పుడు శేఖర్ తన తదుపరి సినిమాను ఇదే క్యాంపులో చేయాల్సి ఉంది. అయితే ఇది ఫిదా సీక్వెల్ మాత్రం కాదులే.

ఇకపోతే ఇంతవరకు కథ రాయని శేఖర్ కమ్ముల.. ఈసారి కూడా కథ రాసిన తరువాత పవన్ కళ్యాణ్‌ మహేష్‌ బాబు రామ్ చరణ్ లకు వినిపించి.. అందరూ రిజక్ట్ చేశాక ఇంకెవరితోనైనా చేస్తాడా లేదంటే ఈసారి స్ర్టయిట్ గా ఎవరన్నా హీరో కోసం కథ రాసుకుంటాడేమో చూడాలి.
Tags:    

Similar News