వీడియో : డాడీ ఫేవరేట్‌ సాంగ్‌ కి సీతూ పాప డాన్స్‌

Update: 2020-08-02 05:18 GMT
సోషల్‌ మీడియా సెన్షేషన్‌ గా మారిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సీతూ పాప మరోసారి తన డాన్స్‌ తో అకట్టుకుంది. ఈసారి మహేష్‌ బాబు సీతూ పాప డాన్స్‌ ను షేర్‌ చేశాడు. రెగ్యులర్‌ గా సీతూ పాప డాన్స్‌ ను నమ్రత షేర్‌ చేస్తూ ఉంటుంది. కాని ఈసారి మాత్రం తన ఫేవరేట్‌ సాంగ్‌ కు సీతూ పాప డాన్స్‌ చేస్తుంది అంటూ మహేష్‌ బాబు సోషల్‌ మీడియాలో ఈ వీడియోను షేర్‌ చేశాడు. బి హ్యాపీ అనే సాంగ్‌ కు చాలా క్యూట్‌ గా సితార వేసిన డాన్స్‌ స్టెప్పులు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సితార వీడియో అయిన ఫొటో అయినా కూడా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. సితార చిన్నప్పటి నుండే సోషల్‌ మీడియాలో చాలా సందడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అన్న గౌతమ్‌ కంటే కూడా ఎక్కువగా సోషల్‌ మీడియా జనాల అటెన్షన్‌ ను దక్కించుకున్న సితార ఇప్పుడు తనే సొంతంగా ఇన్‌ స్టాగ్రామ్‌ పేజ్‌ ను తెరిచింది. అందులో ఆమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. స్నేహితురాలు ఆద్యతో కలిసి ఆమె యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.

Full View

Tags:    

Similar News