• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బోయపాటి సినిమాలు మిక్స్...

బోయపాటి సినిమాలు మిక్స్ చేసి కొట్టారే

By - Tupaki Desk
Update: 2019-01-21 13:16 GMT
వినయ విధేయ రామ వల్ల బోయపాటి శీను బాగా విమర్శల పాలవుతున్నాడు. జయ జానకి నాయక టైంలోనూ ఇన్ని మాటలు పడలేదు కాని రామ్ చరణ్ ని ప్రెజెంట్ చేసిన తీరుకు సోషల్ మీడియాలో బాగా తలంటించుకున్నాడు శీను. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు ఇలా చేయడం ఏమిటా అని అందరు ఆశ్చర్యపోయారు. అయితే ఇతర బాషా దర్శకులు మాత్రం మన బోయపాటిని స్ఫూర్తిగా తీసుకుని తమ హీరోలను ఊర మాస్ అవతారంలో చూపించేందుకు తెగ ఉత్సాహ పడుతున్నారు.

నిన్న సీతారామ కళ్యాణ అనే కన్నడ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరో. తెలుగులో ఇంతకు ముందు జాగ్వార్ ద్వారా సుపరిచితుడే. అది డిజాస్టర్ కావడంతో మనవాళ్ళు మర్చిపోయారు. ఇతని కొత్త సినిమానే సీతారామ కళ్యాణ. ఇందులో విశేషం ఏమిటంటే అంతా తెలుగు సినిమాల కలబోతగా ఉండటం. ముఖ్యంగా బోయపాటి శీను ఆల్ టైం బ్లాక్ బస్టర్ సరైనోడుతో పాటు జయ జానకి నాయక ఛాయలు పుష్కలంగా ఉండటం. అంతే కాదు శరత్ కుమార్ అచ్చం అలాంటి పాత్రే ఇందులో చేసాడు. కొన్ని సన్నివేశాలు నాగ చైతన్య రారండోయ్ వేడుక చూద్దాంను గుర్తుకు తెస్తాయి. శ్రద్ధగా గమనిస్తే బోలెడు తెలుగు సినిమాల పోలికలు వద్దన్నా కనిపిస్తాయి. దీని సంగీత దర్శకుడు మన అనూప్ రూబెన్సే.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాగా అన్ని భారీ ప్రయత్నాలే చేస్తున్న నిఖిల్ గౌడ ఇప్పుడీ సీతరామ కళ్యాణతో పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. శాండల్ వుడ్ టాక్ ప్రకారం ఇది సరైనోడు రీమేకేనట. హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో విడుదల చేయబోతున్నారు. ఏమైనా మాస్ సినిమాల విషయంలో మన దర్శకుల శైలికి పక్క రాష్ట్రంలో కూడా ఫాలోయర్స్ ఉన్నారని అర్థమైపోయిందిగా. ఒక్క రోజులోనే అర మిలియన్ వ్యూస్ కి ఇది చేరువ కావడం విశేషం


Full View
Tags:    
  • Seetharama Kalyana Official Trailer 
  • Yuvaraja 
  • Nikhil Kumar 
  • Rachita Ram 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS