సాయేషా అలా చిల్ అవుట్ అవుతోంది..!

Update: 2019-03-21 12:08 GMT
తమిళ హీరో ఆర్య.. హీరోయిన్ సాయేషాలు లవ్ లో పడిపోవడం..వివాహబంధం లో అడుగుపెట్టి ఒక్కటవ్వడం తెలిసిన విషయాలే. ఆర్య - సాయేషాల వివాహం మార్చ్ 9 హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఇప్పుడు కొత్త జంట హనీమూన్ లో ఉన్నారు.  హనీమూన్ లొకేషన్ ఏదో తెలియదు కానీ సాయేషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా బ్యూటిఫుల్ పిక్స్ పోస్ట్ చేసింది.

ఒక అందమైన స్విమ్మింగ్ పూల్.. నేపథ్యంలో పచ్చని ప్రకృతి.. ఇలా ఉంది ఆ లొకేషన్. వైట్ కలర్ గౌన్ లో బొమ్మలా ఉన్న సాయేషా ఈ ఫోటోలు తన భర్త ఆర్య తీశాడని మురిపెంగా చెప్పుకుంది.  సూర్యుడి కిరణాలు తాకుతుంటే ఆర్య ప్రేమలో మునిగిపోతున్నానని కవితాత్మకంగా ఒక క్యాప్షన్ కూడా పెట్టింది.  ఈ కూల్ లోకేషన్  లో తీసుకున్న మరో ఫోటోలో ఒక టీ కప్పు తో నవ్వుతూ పోజిచ్చింది.

 హనీమూన్ అనేది పెళ్ళైన జంటలకు జీవితంలో ఒక్కసారి వచ్చేది. జీవితాంతం మధురంగా ఉండే ఉండిపోయే జ్ఞాపకం కాబట్టి ఈ కొత్త జంట ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో తమ హనీమూన్ జరుపుకుంటున్నారు. నెటిజనులు కూడా ఈ ఫోటోలకు ఫుల్ గా లైకులు కొట్టారు. బ్యూటిఫుల్ వైఫ్ ఉందంటూ ఆర్యను లక్కీ ఫెలో అంటున్నారు. 
Tags:    

Similar News