ఈ అవార్డులు అలంకారప్రాయమేనా?

Update: 2019-09-23 08:22 GMT
ఇటీవలే జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల వేడుక మీద ఫిలిం నగర్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో సైతం ఓ చర్చ జరుగుతోంది. ఏదో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో కాకుండా అందరికి అన్ని ఇవ్వాలనే స్కీంలో పేరు తెచ్చుకున్న సినిమాల యూనిట్లన్ని సంతృప్తిపడేలా వీటిని ఇచ్చారన్న కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా భరత్ అనే నేనుకు మహేష్ బాబుకు ఇవ్వడం పట్ల మెగా ఫాన్స్ నేరుగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

రంగస్థలంలో చిట్టిబాబుగా చరణ్ నటన ఏ కోణంలో ఆ స్థాయికి సరితూగలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. భరత్ అనే నేను మంచి సినిమానే అయినప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ జోనర్ లో రూపొందిన మూవీ. కాని రంగస్థలం కేసు వేరు. ఓ విభిన్నమైన బ్యాక్ డ్రాప్ తో సుకుమార్ చేసిన ప్రయోగం ఇది. ఇదే కాదు ప్రగ్యా జైస్వాల్ లాంటి ఫాం లోలేని హీరొయిన్లకు సైతం అవార్డులు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను ఇండస్ట్రీ వర్గాలు అత్యున్నత పురస్కారాలుగా భావించేవి. క్రమంగా అవి కనుమరుగయ్యాయి. గత కొన్నేళ్ళుగా ఏ గవర్నమెంట్ వీటిని ఇచ్చే దిశగా చర్యలు తీసుకోలేదు. అంతో ఇంతో ఐఫా సైమా లాంటి వాటికి ప్రేక్షకుల్లో ఆదరణ గుర్తింపు ఉంది. మరి దాదా సాహెబ్ ఫాల్కే లాంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ సైతం ఇలా మారిపోవడం ఏంటని సినీ ప్రేమికులు సైతం విమర్శిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడున్న వాటిలో అధిక శాతం అవార్డులు కేవలం అలంకార ప్రాయంగా మారిపోయాయన్న మాట వాస్తవం


Tags:    

Similar News