• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బొలీవియా పాట గొప్పగా...

బొలీవియా పాట గొప్పగా లేదేంటి?

By - Tupaki Desk
Update: 2016-04-23 11:30 GMT
సరైనోడు టీం రిలీజ్ కు ఓ నెల్లాళ్ల ముందు ఓ సుదీర్ఘ ప్రయాణం చేసింది. ఓ పాట కోసం బొలీవియా చేరుకునేందుకు చాలానే కష్టాలు పడింది. 2 రోజుల ప్రయాణం - 11 గంటల వెయిటింగ్ - 8 గంటల కార్ ప్రయాణం తర్వాత.. సలార్ దె ఉయినికి చేరుకుని ఓ పాటను పిక్చరైజ్ చేశారు. అల్లు అర్జున్ - రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య రొమాంటిక్ సాంగ్ తెలుసా తెలుసా కోసం ఈ కష్టమంతా.

ఉప్పుతో కప్పేసిన తెల్లటి స్వర్గం లాంటి ప్రదేశమే ఈ ఉయిని. ఆడియో పరంగా ఆకట్టుకున్న ఈ సాంగ్.. విజువల్ గా మరింత గొప్పగా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయడం సహజం. కానీ ఆన్ స్క్రీన్ పై కూడా ఆకట్టుకున్నది మ్యూజిక్ మాత్రమే. విజువలైజేషన్ సాధారణంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే అల్లుడు శీను లో బెల్లంకొండ శ్రీనివాస్ - సమంతల మధ్య వచ్చే నీలి నీలి పాటకు జిరాక్స్ లా అనిపించిందనే టాక్ వినిపిస్తోంది. అల్లుడు శీను అంతా గ్రాఫిక్స్ లో  తీసేయగా.. సరైనోడు కోసం నిజంగానే ఆ ప్రాంతానికి వెళ్లి షూటింగ్ చేసుకొచ్చారు. ఇంత కష్టపడి మరీ విజువలైజేషన్ చేయలేకపోవడం ఆశ్చర్యకరం.

నిజానికి ఇలా రియల్ గా ఆ ప్రదేశాలకు వెళ్లి తీయడంలో శంకర్ సిద్ధహస్తుడు రోబో సాంగ్స్ పెరులోను మాచు పిచ్చు - బ్రెజిల్ లో తీసిన మాటలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి. ఆ రేంజ్ కాకపోయినా.. కనీసం సరైనోడు టీం చెప్పిన మేరకైనా బొలీవియా అందాలను ప్రెజెంట్ చేయలేకపోవడం ఆశ్చర్యకరం.
Tags:    
  • Allu Arjun 
  • Sarrainodu 
  • Telugu NEws 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS