• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రిలీజ్ లో `9` సెంటిమెంటు...

రిలీజ్ లో `9` సెంటిమెంటు చూడ‌లేదేం?

By - Tupaki Desk
Update: 2019-10-26 07:09 GMT
సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో సెంటు కొట్టుకోవాల‌న్నా సెంటిమెంటు త‌ప్ప‌నిస‌రి. ప్ర‌తిదీ సెంటిమెంటుతో ముడిప‌డి ఉంటుందిక్క‌డ‌. కొంద‌రు హీరోలు ఇంట్లోంచి బ‌య‌ట అడుగుపెట్టేప్పుడే వారం వ‌ర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం.. వగైరా వ‌గైరా శాస్త్రాన్ని తిర‌గేస్తారు. ఠెంకాయ కార్య‌క్ర‌మాల‌కు అయితే ఈ సెంటిమెంటు పీక్స్ లో ఉంటుంది. ఏదో ఒక ముహూర్తం అంటూ రాజీకి రాలేరు ఇక్క‌డ‌. కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్ల‌తో వ్య‌వ‌హారం కాబ‌ట్టి సెంటిమెంటు అంతే స్ట్రాంగా ఉంటుంది. అయితే ఈ సెంటిమెంట్ విష‌యంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` టీమ్ త‌క్కువేమీ కాద‌ని ప్రూవ్ అవుతోంది. సీఎం కేసీఆర్ `6-సిక్స్` సెంటిమెంటులా .. స‌రిలేరు బృందానికి `9-తొమ్మిది` సెంటిమెంటు అంతే ఇదిగా ఉంది.

తొలి నుంచి ఇది బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. మొన్న‌టికి మొన్న‌ ద‌స‌రా పోస్ట‌ర్ వేసినప్పుడు సాయంత్రం 5:04 పీఎం కు పోస్ట‌ర్ విడుదల అవుతుంది అంటూ సెంటిమెంటుని ఫాలో చేశారు. ఆ నంబ‌ర్లు అన్నీ క‌లిపితే `9-తొమ్మిది` వ‌స్తోంది. 9:09 AM అంటూ మ‌హేష్ ఇంట్రో పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

తాజాగా విజ‌య‌శాంతి పోస్ట‌ర్ ని అదే త‌ర‌హా సెంటిమెంటుతో  9:09 AM రిలీజ్ చేయడం ఆస‌క్తిక‌రం. అలాగే
5:04 పీఎం సూప‌ర్ స్టార్ పోస్ట‌ర్ రిలీజ‌వుతుందని ఓ హింట్ ఇచ్చారు. అంటే ఆ అంకెల్ని క‌లిపితే 9 అంకె వ‌స్తుంది. మొత్తానికి చిత్ర‌బృందానికి ఈ తొమ్మిది సెంటిమెంటు ఎంత బ‌లంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

నిర్మాతలు అనీల్ సుంకర్-దిల్ రాజు.. దర్శకుడు అనిల్ రవిపుడితో సహా సరిలేరు నీకెవ్వ‌రు బృందం తొమ్మిది సెంటిమెంటుతో చేస్తున్న ట్వీట్లు అభిమానుల్లోకి దూసుకెళుతున్నాయి.. 9 కి క‌ట్టుబ‌డిన బ్యాచ్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ ర‌కంగానూ ఇది స‌రిలేరు ప్ర‌చారానికి క‌లిసొస్తోంది. 2020 జ‌న‌వ‌రి 12 రిలీజ్ తేదీని లాక్ చేశారు క‌దా? అక్క‌డ  12-01-2020 తేదీకి మాత్రం `9-తొమ్మిది` సెంటిమెంటు చూడ‌లేదేం?
Tags:    
  • Sarileru Neekevvaru 
  • Following 
  • 9 
  • Sentiment 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS