ఆ హీరోయిన్ ఇలా మారిపోయింది

Update: 2017-06-08 06:50 GMT
కొంతమంది హిరోయిన్లు ఒక్కసారిగా వచ్చి వెంటనే మళ్ళీ మాయమైపోతారు. విలేజ్ లో వినాయకుడు’, ‘భీమిలి కబడ్డీ జట్టు' వంటి సినిమాలలో నటించిన శరణ్య మోహన్ కూడా ఎంత తొందరగా వచ్చిందో అంతే తొందరగా ఇండస్ట్రిని వదిలి వెళ్లిపోయింది. ఈమె చేసిన సినిమాలు చేసినవి తక్కువైన వినయంగా పలకిరించినా బంతి పువ్వు లా కనిపించి సినిమాలు ఎక్కువగా చూసేవారికి గుర్తుండి పోయేలా మిగిలిపోయింది.

తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ్ లో ఈమె చాలా సినిమాలే చేసింది. ‘వెన్నిల కబడ్డీ కుళు” తో పాటు తెలుగు ‘చందమామ’ రీమేక్ సినిమాలలో కూడా నటించింది. గ్లామర్ పాత్రలు తక్కువ చెయ్యడం వలనో లేక ఆమెకే ఇష్టం లేకపోవడం వలనో హీరోయిన్ ఛాన్సులు తక్కువ వచ్చాయి. దానితో  కొన్ని సినిమాలో చెల్లెలు పాత్రలు, చిన్న హీరోయిన్ పాత్రలు చేసింది శరణ్య. కళ్యాణ్‌ రామ్ 'కత్తి' సినిమాలో చెల్లెలుగా కనిపించింది. గతేడాది డా.అరవింద్ ను పెళ్ళిచేసుకుని.. ఈమధ్యనే తల్లి కూడా అయ్యింది. తాజాగా ఫేస్ బుక్ లో ఈమె ఫొటో ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అందరినీ  ఆశ్చర్యపరిచింది. నాజుకుగా ఉండే  శరణ్య ఇప్పుడిలా ప్రెగ్నెసీ తరువాత భారీగా వెయిట్ గెయిన్ చేయడంతో.. అందరూ షాకయ్యారు.

ఇక చాలామంది హీరోయిన్లు తల్లయ్యాక ఎంత లావెక్కినా కూడా.. వెంటనే మొత్తం కరిగించేస్తున్నారు. ఐశర్య రాయ్.. కరీనా కపూర్ లే అందుకు ఉదాహరణ. మరి శరణ్య అలా చేస్తుందో లేదో తెలియదు కాని.. ఆమె భర్త మాత్రం.. ''మా ఆవిడ పెళ్ళి కోసం తన సినీ కెరియర్ వదిలేసింది. తను చాలా గ్రేట్. లావుగా ఉందని కామెంట్ చేస్తున్నవారందరికీ అసలు కనీసం కామెంట్ చేసే హక్కు కూడా లేదు'' అంటూ ఆన్ లైన్ ట్రాలింగ్ చేస్తున్నవారికి ఆన్సర్ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News