యూఎస్: సంక్రాంతి సినిమాల ట్రేడ్ రిపోర్ట్

Update: 2019-01-12 15:30 GMT
అమెరికా బాక్స్ ఆఫీస్ సంగతి తీసుకుంటే సంక్రాంతి సీజన్లో మొత్తం అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి.  అందులో మూడు తెలుగు కాగా రెండు తమిళం.  తెలుగులో 'ఎన్టీఆర్ కథానాయకుడు'.. 'వినయ విధేయ రామ'.. 'ఎఫ్ 2'  రిలీజ్ కాగా తమిళ సినిమాలు 'పెట్టా'.. 'విశ్వాసం' రిలీజ్ అయ్యాయి.

ఈ ఐదు సినిమాల్లో 'ఎన్టీఆర్ కథానాయకుడు' కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.  ఇక 'వినయ విధేయ రామ' కు రెస్పాన్స్ డల్ గానే ఉంది. తాజాగా $200K  మార్క్ దాటింది. మరోవైపు 'ఎఫ్2'  ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్లతోనే $199K  వసూలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే రజనీకాంత్ 'పెట్టా' రెండు  వెర్షన్ల కలెక్షన్స్ 1 మిలియన్ డాలర్ మార్కును దాటాయి.  రజనీ కెరీర్లో ఇది ఏడో వన్ మిలియన్ డాలర్ ఫిలిం. ఇలాంటి రికార్డు మరే ఇతర తమిళ హీరోకు కూడా లేదు.  ఇక అజిత్ 'విశ్వాసం' మాత్రం $100k  మార్క్ కూడా టచ్ చేయలేదు.

ఇవి కాకుండా బాలీవుడ్ సినిమాలు 'యూరి'.. 'సింబా'.. 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాల కలెక్షన్స్ $100k లోపే ఉన్నాయి.  ఐదు సౌత్ సినిమాలతో పాటుగా ఈ మూడు హిందీ సినిమాల కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్టీఆర్ కథానాయకుడు: $699,867
వినయ విధేయ రామ: $207,856
ఎఫ్ 2: $199,676
పెట్టా: $1,090,664(తమిళ తెలుగు వెర్షన్లు కలిపి)
విశ్వాసం: $84,354
యూరి: $97,123
సింబా: $82,721
యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: $38,454   
    

Tags:    

Similar News