500 కోట్ల క్ల‌బ్ లో `సంజు`!

Update: 2018-07-14 16:24 GMT
బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ రికార్డు క‌లెక్ష‌న్లు సాధిస్తోన్న సంగ‌తి తెలిసిందే.  విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ బ‌యోపిక్ లో ర‌ణ్ బీర్ త‌న న‌ట విశ్వ‌రూపం చూపించాడు. సంజు పాత్ర‌లో అత‌డు ఒదిగిన తీరుకు ప్రేక్ష‌కుల‌తోపాటు విమ‌ర్శ‌కులూ ఫిదా అయ్యారు. అందుకే ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే దాదాపు రూ.200 కోట్లకు పైగా కొల్ల‌గొట్టింది. తాజాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం 500 కోట్లు వ‌సూలు చేసి మ‌రిన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేందుకు దూసుకుపోతోంది. విడుద‌లైన రెండువారాల్లో `సంజు`ప్ర‌పంచ‌వ్యాప్తంగా 500.43 కోట్ల‌ను రాబ‌ట్టింది. ర‌ణ్ బీర్ కెరీర్ లో ఇది అతి పెద్ద హిట్ గా నిలిచింది. 2018లో విడుద‌లైన సినిమాల్లో తొలిరోజు అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా `సంజు`స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

కాగా, మ‌రోవైపు ఈ సినిమాను కేవ‌లం సంజ‌య్ దృష్టికోణం నుంచే తీశార‌ని,...వాస్త‌వాల‌ను క‌ప్పి పుచ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ విమ‌ర్శ‌ల‌పై సంజు స్పందించారు. ‘మున్నాభాయ్’ లో త‌న‌ రియల్‌ లైఫ్‌ అవతారాన్ని చూపించారని, ఒక‌ మనిషి వ్యక్తిత్వాన్ని మార్చి చూపించేందుకు రూ.40 కోట్లు ఖర్చుచేస్తారని తాను అనుకోన‌ని సంజ‌య్ అన్నారు. త‌న‌ గురించి అన్ని నిజాలు చెప్పాన‌ని, దేశ‌మంతా దానిని స్వీక‌రించింద‌ని చెప్పారు. సినిమా వ‌సూళ్లే ఆ విష‌యం చెబుతాయ‌ని అన్నారు. త‌న‌ బాల్యం కూడా ఒక సాధారణ యువకుడిలాగే సాగింద‌ని, సునీల్‌ దత్‌ కుమారుడిగా ప్ర‌త్యేక‌త ఏమీ లేద‌ని చెప్పారు. జీవితంలో చాలా తప్పులు చేశాన‌ని....అందుకు జైలు శిక్ష అనుభ‌వించాన‌ని , అయినా....తానేమీ బాధపడటంలేద‌ని సంజ‌య్ అన్నారు.
Tags:    

Similar News