పౌర‌ణికంలో యాక్ష‌న్...హీరో అత‌నే?

Update: 2023-07-13 05:00 GMT
పాన్ ఇండియా లో పౌరాణికాల ట్రెండ్ మ‌ళ్లీ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లో స‌క్సెస్ అవ్వాలంటే కంటెంట్ యూనిక్ గా ఉండాలి. అలాంటి వాటికిప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అందుకే ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ సైతం 'మ‌హాభార‌తం' విష‌యం లో ఇంకేమాత్రం ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని భావించి ఆ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే రామాయ‌ణం ఆధారంగా  తెరకెక్కిన 'ఆదిపురుష్' అనుకున్న ఫ‌లితాలు సాధించ‌న‌ప్ప‌టికీ ఓ ప్ర‌య‌త్నం జ‌రిగింది.

ఇలాంటి క‌థ‌ల్ని మ‌రిన్ని తెర‌పైకి తీసుకురావాల‌ ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌- హీరోలు సీరియ‌స్ గానే ఉన్నారు. అల్లు అర‌వింద్ రామాయాణ‌న్ని  భారీ ఎత్తున ప్లాన్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇలా ఇతిహాసాలు పౌరాణికాలుగా మారుతున్నాయి. తాజాగా  బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కూడా ఓ పౌరాణిక క‌థ‌తో పాన్ ఇండియా లో ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆయ‌న హీరోగా యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. 2024లో ఈసినిమా ప్రారంభం కానుంది. సంజ‌య్ ద‌త్ ని మునుపెన్న‌డు చూడ‌ని విధంగా కొత్త లుక్ లో చూపించ‌బోతున్నారు. బాలీవుడ్ టాప్  టెక్నీషియ‌న్లు.. బ‌డా బ్యాన‌ర్  ఈ ప్రాజెక్ట్ ని టేక‌ప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే  ద‌ర్శ‌క-నిర్మాత‌ల వివరాలు మాత్రం ద‌త్ గోప్యంగా ఉంచారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వాటిని తానే  స్వ‌యంగా ప్ర‌క‌టిస్తాన‌న్నారు.

'కేజీఎఫ్‌-2' తో ఇండియా కొత్త సంజ‌య్ ద‌త్ ని చూసిన సంగ‌తి తెలిసిందే. అధీర పాత్ర‌ లో ద‌త్ అద‌ర‌గొట్టిన వైనం అభిమానుల‌ కు షాకింగ్. అత‌ని ఆహార్యం..గెట‌ప్ ప్ర‌తీది సినిమా ని నెక్స్ట్ లెవ‌ల్ కి తీసుకెళ్లింది. న‌టుడి గా ఆయ‌న ఇమేజ్ ని రెట్టింపు చేసిన చిత్రం. ఈ నేప‌థ్యం లో ద‌త్ సైతం త‌న‌ లో కొత్త న‌టుడ్ని ఆవిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఆయ‌న 'మ‌హారాజా'..'లియో'..'బాప్' చిత్రాల్లో న‌టిస్తున్నారు. ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ నుంచి ప్ర‌తి నాయ‌కుడి అవ‌కాశాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఎన్నికోట్లు చెల్లించైనా పెట్టుకోవ‌డానికి  నిర్మాత‌లు సిద్దంగా ఉంటున్నారు. అదంతా 'కేజీఎఫ్' చ‌ల‌వ‌నే చెప్పాలి.

Similar News