`ఖ‌ల్ నాయ‌క్` ని మించిన మరొక‌డు పుడ‌తాడా?

Update: 2021-09-07 10:22 GMT
నాయ‌క్ న‌హీ.. ఖ‌ల్ నాయ‌క్ న‌హీ..! ఈ పాట‌ను అంత తేలిగ్గా సంజ‌య్ ద‌త్ అభిమానులు మ‌ర్చిపోలేరు. ఖ‌ల్ నాయ‌క్ గా ఇప్ప‌టికీ ఆయ‌న అభిమానుల గుండెల్లో ఉన్నారు. మున్నాభాయ్ గానూ చెర‌గ‌ని ముద్ర వేశారు సంజ‌య్ ద‌త్. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బ‌లు తిని జైలుకు వెళ్లిన‌ ద‌త్ వివాదాలు అన్నీ ఇన్నీ కావు.. ఇంత‌కుముందే క్యాన్సర్ కి చికిత్స పొందాడు. అతను క్యాన్సర్ భయానికి దూరంగా ఉన్నందున ప్రశాంతంగా ఉన్నాడు. కోర్టు కేసులు గొడ‌వ‌ల నుంచి దూరంగా ఉన్నారు.

ఇక జైల్లో ఉన్నంత కాలం సంజూకి అన్నీ తానే అయ్యారు మాన్య‌తా ద‌త్. అందుకే మాన్య‌త అన్నా త‌న కిడ్స్ అన్నా అమిత‌మైన ఇష్టం సంజ‌య్ కి. డైలీ షూటింగులు పూర్తి చేసిన తర్వాత దత్ ఎక్కువగా ఇంట్లో తన పిల్లలతో ఆడుకుంటాడు. సంజయ్ దత్ తన పిల్లల్లో సంజూని ఎంతో ఇష్టపడతారని అతనితో నిత్యం గ‌డిపేందుకు ఆస‌క్తిగా ఉంటార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇంత‌కీ త‌న‌కు ఇష్ట‌మైన పిల్ల‌ల‌ను సినీరంగంలోకే తెస్తారా? అన్న ప్ర‌శ్న‌కు సంజ‌య్ దత్ జ‌వాబిచ్చారు. తన కుమార్తె చాలా మంచి కళాకారిణి అని ద‌త్ చెప్పారు. కానీ అతని కుమారుడు షహరాన్ నటుడ‌య్యేందుకు అవ‌స‌ర‌మైన‌ అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు. అత‌డు పెద్ద స్టార్ అవుతాడు.. అని ద‌త్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. సంజయ్ దత్ కు మొదటి భార్య‌కు త్రిషాల అనే కుమార్తె ఉంది. త్రిషాల‌ ఒక మనోరోగ వైద్యనిపుణురాలు. కేజీఎఫ్ 2 లో యష్ తో కలిసి ద‌త్ కనిపించనున్నారు. అధీరా అనే భ‌యంక‌ర‌మైన విల‌న్ గా సంజ‌య్ ద‌త్ న‌టించారు.


KGF: చాప్టర్ 2 .. అత్యంత క్రూరుడు అధీరా!

కేజీఎఫ్ - చాప్ట‌ర్ 2లో అధీరాగా క‌నిపించ‌నున్నారు సంజ‌య్ ద‌త్. ఈ పాత్ర కోసం సంజ‌య్ ద‌త్ రూపం మార్చేశారు. ఆయ‌న‌ను అరివీర భ‌యంక‌రుడిగా ఈ చిత్రంలో క‌నిపిస్తారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ కి అద్భుత స్పంద‌న వచ్చింది. సంజ‌య్ ద‌త్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన కొత్త‌ పోస్ట‌ర్ తో అధీరా క్రూర‌త్వాన్ని ఇక తెర‌పై చూడాల్సిందే అన్నంత క‌సిని ర‌గిలించాడు. అధీరాను మాన్ స్ట‌ర్ లా ఆవిష్క‌రించారు ప్ర‌శాంత్ నీల్.

పురాణాల్లో భీష్ముడు కాస్త అటూ ఇటూగా ఇలాగే క‌వ‌చం ధ‌రించి క‌నిపించేవాడ‌ని.. లేదూ `వార్ ఆఫ్ ది యారోస్` చిత్రంలో విల‌న్ ఇలానే క‌నిపించాడ‌ని సినీప్రేమికులు విశ్లేషించారు. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా కేజీఎఫ్ 2 రికార్డుల‌కెక్కింది. ఇందులో యాక్షన్ డ్రామా ఏ రేంజులో ఉంటుందో అభిమానులు గెస్ చేస్తూనే ఉన్నారు. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన `కేజీఎఫ్: చాప్టర్ 2` బ‌హుభాష‌ల్లో అత్యంత భారీగా రిలీజ్ కానుంది. క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రంలో రవీనా టాండన్ మ‌రో ప్రధాన పాత్రలో నటించారు. కోలార్ బంగారు గ‌నుల మాఫియా క‌థాంశంతో ఈ చిత్రాన్ని మొద‌టి భాగాన్ని మించిన యాక్ష‌న్ తో తెర‌కెక్కిస్తున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. రాకింగ్ స్టార్ య‌ష్ పాత్ర‌తో పోటీప‌డుతూ అధీరా పాత్ర సాగుతుంద‌ని ఇప్ప‌టికే గుసగుస‌లు వినిపించాయి. ఇందులోనూ పార్ట్ 1 త‌ర‌హాలో ఒక‌రిని మించి ఒక‌రు అన్న చందంగా ఏడెనిమిది పాత్ర‌ల‌ను తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రిస్తున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 పై అంచ‌నాలు స్కైని తాకాయి. మోస్ట్ అవైటెడ్ 2021 మూవీ కోసం అభిమానులంతా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. రిలీజ్ తేదీ ప్ర‌క‌టిస్తారనే వేచి చూస్తున్నారు.







Tags:    

Similar News