'వెబ్ సిరీస్'లోకి మరో సెన్సేషనల్ డైరెక్టర్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తగా బోల్డ్ కంటెంట్ సినిమా తీయొచ్చు.. ఆడతాయి అని నిరూపించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. 2017లో 'అర్జున్ రెడ్డి' అనే చిన్న సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీలో హీరోని యాంగ్రీ లుక్, ఎమోషన్స్ చూపించడంలో మంచి మార్కులు కొట్టేసాడు. దీంతో తొలి సినిమాతోనే సెన్సేషనల్ డైరెక్టర్‌గా గుర్తింపు పొంది మంచి పాపులారిటీ సంపాదించాడు సందీప్. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వైపు అడుగులేసాడు సందీప్ రెడ్డి వంగా.. అక్కడ కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో రూపొందించిన అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో బీ టౌనులో సందీప్ రెడ్డి వంగా పేరు పాపులర్ అయిపోయింది.
ఈ నేపథ్యంలో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ నిర్మాతలు సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంటున్న సందీప్.. తదుపరి బాలీవుడ్ మూవీ సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీ అయ్యాడట. ప్రస్తుతం హీరోలంతా తమ ప్రాజెక్టులతో బిజీ ఉన్నారు. ఇంకా కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుత సినిమాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ సినిమా ఎవరితో చేయనున్నాడో అని సినీ అభిమానులలో ఆసక్తి నెలకొంది. కానీ సందీప్ గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా మరింత ఆలస్యం కానుందని.. ఈ గ్యాప్ లో ఓ వెబ్ సిరీస్ రూపొందించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేగాక వెబ్ సిరీస్ తెలుగు, హిందీతో పాటు ఇతర బాషలలో కూడా రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. మరి అసలు విషయం తెలియాలంటే సందీప్ నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.