డ్రగ్స్ కేసు: బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సీసీబీ సోదాలు...!
కన్నడ చిత్ర సీమలో వెలుగులోకి డ్రగ్స్ వినియోగం, సరఫరా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పలువురు శాండిల్ వుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు.. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బావ మరిది, కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా ఇంట్లో సోదాలు నిర్వహించారు. డ్రగ్ వ్యవహారం కేసులోని 12 మంది ప్రధాన నిందితుల్లో ఆదిత్య అల్వా కూడా ఉన్నట్లు సీసీబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న ఆదిత్య అల్వా కోసం ముంబైలోని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంటిపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెయిడ్స్ చేశారని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. అల్వా తన సోదరి ప్రియాంక (వివేక్ ఒబెరాయ్ భార్య) ఇంట్లో దాక్కున్నాడనే అనుమానంతో ముంబైలోని వివేక్ ఇంటిని సెర్చ్ చేయడానికి సీసీబీ వారెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, దివంగత గౌరీ లాంకేష్ సోదరుడు ఇంద్రజిత్ లాంకేష్ ఇచ్చిన సమాచారం మేరకు శాండిల్ వుడ్ మాదక ద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అనేక మంది ప్రమేయాన్ని గుర్తించిన సీసీబీ అధికారులు.. నటీమణులు రాగిణి ద్వివేది - సంజనలతో పాటు ఖన్నా - వ్యాపారవేత్త రాహుల్ - నటుడు నియాజ్ లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో ఆదిత్య అల్వా పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు అతని ఇంటిపై దాడులు చేశారు. ఈ నేసథ్యంలో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఆదిత్య అల్వా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు లేటెస్టుగా ఆదిత్య కోసం అతని బావ వివేక్ ఒబెరాయ్ ఇంటిని సీసీబీ అధికారులు సెర్చ్ చేసినట్లు నేషనల్ మీడియా ఛానల్ తెలిపింది.