• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్పై కెమెరాలపై స‌నా...

స్పై కెమెరాలపై స‌నా `మిస్డ్ కాల్ ` ఉద్య‌మం!

By - Tupaki Desk
Update: 2017-12-25 11:03 GMT
కొన్ని షాపింగ్ మాల్స్ - ఆఫీసులు - హోట‌ళ్లు - రెస్టారెంట్లు - హాస్ట‌ళ్లు వంటి ప్ర‌దేశాల‌లో స్పై (ర‌హస్య‌) కెమెరాల‌తో కొంద‌రు నీచులు మ‌హిళ‌ల వీడియోలు చిత్రీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రికొంద‌రు ఏకంగా బాత్రూమ్ లు - బెడ్రూమ్ ల‌లో ర‌హ‌స్య కెమెరాల‌ను ఏర్పాటు చేసి మ‌హిళ‌లు - దంప‌తుల న‌గ్న వీడియోల‌ను కూడా  చిత్రీక‌రించి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయ‌డం వంటి దుర్మార్గాల‌కు పాల్ప‌డుతున్న ఉదంతాల గురించి మ‌నం వింటూనే ఉన్నాం. ఆ కెమెరాలు అక్క‌డ ఉన్నాయ‌న్న సంగతి కూడా బాధితుల‌కు తెలియ‌ని ప‌రిస్థితులు కూడా ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదు. అందుబాటులోకి వ‌చ్చిన టెక్నాల‌జీతో కొందరు దుర్మార్గులు ఇటువంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో...మార్కెట్లో ఇబ్బడి ముబ్బ‌డిగా దొరుకుతున్న‌  స్పై కెమెరాల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సినీనటి సన అన్నారు. హెవెన్‌ హోమ్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో `యాంటీ రెడ్‌ ఐ క్యాంపెయిన్` బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ ఈ  స్పై కెమెరాల బారిన ప‌డ‌తున్నార‌ని స‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాక్ష్యాత్తూ....కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఆ ఇబ్బందుల‌కు గురి కావ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. స్పై కెమెరాల అమ్మకాల నియంత్రణ - కఠిన చట్టాలు త‌యారు చేయాల‌ని కోరుకునే వారంతా 80992 59925 నెంబర్ కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని చెప్పారు. ఓటింగ్‌ ద్వారా ఈ స‌మ‌స్య‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామ‌ని చెప్పారు. ఆన్‌ లైన్ లో రూ.250కే స్పై కెమెరాలు దొరుకుతున్నాయ‌ని - వాటి వెనుక ఉన్న మాఫియా ఉందన్నారు. హీరోయిన్లు సమంత - మెహరీన్ తో ఈ విషయం గురించి చ‌ర్చించాన‌ని - మిగిలిన ఇండ‌స్ట్రీల వారి నుంచి మ‌ద్దతు తీసుకొని `కోటి మిస్డ్‌ కాల్‌` ల కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. మ‌హిళ‌లంతా ఈ కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తివ్వాల‌ని కోరారు.
Tags:    
  • Sana 
  • Anti Red Eye India campaign 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS