ఏయ్ .. రెక్లెస్ డేనియ‌ల్ వైఫ్ ఈవిడే!

Update: 2021-11-15 11:31 GMT
పెద్ద బ్యాన‌ర్ల‌లో అవ‌కాశం రావ‌డం అంటే అదృష్టం అనే చెప్పాలి. ఇప్పుడు ఓ మాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో టాప్ బ్యాన‌ర్ల‌లో అవ‌కాశాలు అందుకుంటోంది. ఈ బ్యూటీ నామ‌ధేయం సంయుక్త మీన‌న్. వివ‌రాల్లోకి వెళితే..

ప‌వ‌న్ క‌ల్యాణ్‌-రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయ‌క్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళ సినిమా `అయ్య‌ప్పనుమ్ కోషియ‌మ్` కి రీమేక్ ఇది. మాతృక‌లో బిజు మీన‌న్ పోషించిన పాత్ర‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ పాత్ర‌లో రానా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. ప‌వ‌న్-రానా ల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

ఇందులో ప‌వ‌న్ భార్య పాత్ర‌లో నిత్యామీన‌న్ న‌టిస్తుండ‌గా.. రానా భార్య రోల్ కి బాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీన‌న్ అవ‌కాశం ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ న‌టి ఐశ్వ‌ర్యా రాజేష్ ని సంప్ర‌దించ‌గా ఆమె బిజీ షెడ్యూల్ కార‌ణంగా కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోయారు. దీంతో మేకర్స్ మ‌ల‌యాళం యువ న‌టి సంయుక్త మీన‌న్ ని రంగంలోకి దించార‌ని క‌థ‌నాలొచ్చాయి. సంయుక్త‌ నేచుర‌ల్ పెర్పార్మ‌ర్.. నిత్యాతో పోటీప‌డి న‌టించ‌గ‌లిగే స‌మ‌ర్థురాలు అని తెలుస్తోంది.

రానా స‌ర‌స‌న నాయిక‌గా సంయుక్త అద‌ర‌గొడుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయ‌క్ రిలీజ్ త‌ర్వాత ఈ అమ్మ‌డు కూడా నివేథా థామ‌స్..కీర్తి సురేష్.. అనుప‌మ త‌ర‌హాలో టాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.

క‌ళ్యాణ్ రాముని స‌ర‌స‌న‌..!

భీమ్లా నాయ‌క్ తో పాటు సంయుక్త‌కు మ‌రో చిత్రంలోనూ అవ‌కాశం ద‌క్కింది. కల్యాణ్ రామ్ న‌టిస్తున్న‌ రావ‌ణ్ అనే ఫాంట‌సీ మూవీ లో సంయుక్త క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌ల్లిడి వ‌శిష్ఠ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. రావ‌ణ్ పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలోని ఫాంట‌సీ డ్రామా.

అందుకు త‌గ్గ‌ట్టే విస్తృతమైన వి.ఎఫ్.ఎక్స్ ఉంటుంద‌ని తెలిసింది. కళ్యాణ్ రామ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఇద్దరు యువ నాయిక‌ల‌తో రొమాన్స్ చేస్తున్నారు. బెంగళూరు బ్యూటీ కేథరిన్ ట్రెసా ప్ర‌ధాన నాయిక కాగా.. మలయాళ నటి సంయుక్త మీనన్ ఇందులో రెండో నాయిక‌గా న‌టించ‌నుంద‌ని తెలిసింది.






Tags:    

Similar News