వచ్చే ఏడాది నాకు అలాంటి జీవితం కావాలి
నాగచైతన్యతో తాను విడిపోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా సమంత వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ఇద్దరి నుంచి రావడంతో చాలా మంది సమంతపై కామెంట్ లు చేశారు, అంతే కాకుండా సమంత అతి ప్రవర్తన కారణంగానే చై ఆమెతో కలిసి నడవలేక విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారని ప్రచారం జరిగింది.
దీంతో సమంతని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ కనిపించాయి. అయితే ట్రోల్స్ వ్యక్తిగతంగా తనకు బాధకలిగించడంతో తాను ప్రస్తుతం సమస్య నుంచి కోలుకోవడానికి కొంత సమయాన్ని ఇవ్వండంటూ తనని విమర్శిస్తున్న వారికి విజ్ఞప్తి చేసింది సమంత.
కొంత విరామం తీసుకున్న సమంత మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. గుణ్ శేఖర్ తెరకెక్కిస్తున్న `శాకుంతలం`ని పూర్తి చేసిన ఆమె సూపర్ నేచురల్ థ్రిల్లర్ అంశాలతో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న `యశోద`చిత్రాన్ని అంగీకరించింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇక సుకుమార్ - బన్నీ కలయికలో వస్తున్న `పుప్ప` కోసం ప్రత్యేక గీతంలో నర్తించింది.
ఈ పాట షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది కూడా. మళ్లీ మళ్లీ తనని విడాకుల గురించి ప్రశ్నిస్తుండటంతో మరోసారి స్పందించిన సమంత విడాకుల తరువాత తాను చనిపోతానేమోనని అనిపించిందని షాకిచ్చింది. అయితే తాను బలంగా మారానని చెప్పుకొచ్చింది. కానీ విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలా వుంటే విడాకులపై తాజాగా మరోసారి స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఈ టైమ్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన విడాకుల గురించి మరోసారి స్పష్టం చేసింది.
విడాకుల తరువాత తనపై జరిగిన అసత్య ప్రచారాన్ని ఆపడం కోసమే తాను స్పందించానని, మళ్లీ మళ్లీ దాని గురించి మాట్లాడటం అనవసరమని తేల్చేసింది. వచ్చే ఏడాది ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నానని తెలిపింది. ఇకపై అద్భుతమైన పాత్రలు చేయాలనుకుంటున్నానని, వాటి కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమని పేర్కొంది.