స‌మంత‌ను చూసి నేర్చుకోండ‌మ్మా!!

Update: 2018-02-28 17:30 GMT
ఇప్ప‌టి హీరోయిన్ల‌తో పోలిస్తే స‌మంతకు మంచి ప్లానింగ్ ఉంద‌ని అర్ధ‌మైపోతుంది. క్లాస్ సినిమాలు... మాస్ సినిమాలు రెండూ చేసుకుంటూ వ‌స్తోంది. క్లాస్ సినిమాలు చేస్తాను అంటే... ఆమెకు మాస్ జ‌నాలు ఎప్పుడో దూర‌మైపోయేవారు. అదే మాస్ సినిమాలే కావాలంటే...క్లాస్ పీపుల్ ఆమెను చూసే వారే కాదు. కానీ ఆమె ప‌క్కా ప్లానింగ్‌ తో ఆమె చేసిన సినిమాలు స‌మంత‌కు ఇద్ద‌ర్ని ద‌గ్గర చేశాయి. కానీ ఈ ప‌ద్ద‌తి ఇప్ప‌టి హీరోయిన్లు పాటించలేక‌పోతున్నారు.

రాశీ ఖ‌న్నా... ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదా కోసం ప్ర‌య‌త్నిస్తోంది. దాదాపు ఆ హోదాకు ద‌గ్గ‌ర్లో ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఆమె నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో త‌డ‌బ‌డిపోతోంది. ఊహ‌లు గుస‌గుస‌లాడే  సినిమాలో ప‌క్కింటి పిల్ల‌లా ఒద్దిక‌గా క‌నిపించి... క్లాస్ జ‌నాల‌కు చాలా న‌చ్చేసింది. ఆ త‌రువాత ర‌వితేజ‌ - ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. ఆ సినిమాలేవీ ఆమెకు అంత మంచి పేరు తెచ్చిపెట్ట‌లేదు. వ‌రుణ్ తేజ్‌ తో చేసిన తొలిప్రేమ మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర వ‌చ్చింద‌ని... ఇక‌పై అలాంటి సినిమాలే చేయాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. అలాంటి పాత్ర‌లే చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టుకుని కూర్చుంటే... క‌ష్ట‌మే అంటున్నారు సినీజ‌నాలు.తెలివిగా... స‌మంత‌లా ప్లాన్ చేసుకుంటే స‌మ‌స్య‌లే రావంటున్నారు.

సామ్ ఏ మాయ చేశావే లాంటి క్లాస్ మూవీ ద్వారా ప‌రిచ‌యం అయ్యింది. అలాగ‌ని క్లాస్ మూవీల‌కే ప‌రిమితం అయిపోలేదు. ఒక ప‌క్క ఈగ... ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు వంటి క్లాస్ మూవీలో చేస్తూనే... మ‌రోప‌క్క జ‌బ‌ర్ద‌స్త్‌... అత్తారింటిదారేది లాంటి మాస్ సినిమాల‌లోనూ మెరిసింది. ఇప్పుడు రంగ‌స్థ‌లం కూడా మాస్ మూవీ కిందే లెక్క‌. ఆమె చేసిన సినిమాల జాబితా... క్లాస్‌... మాస్ మూవీల క‌ల‌యిగా ఉంటుంది. అందుకే ఆమెకు రెండు ర‌కాల సినిమా అవ‌కాశాలు ఇప్ప‌టికీ వ‌స్తున్నాయ్‌. సో ఇప్ప‌టి హ‌రోయిన్స్ సామ్‌ను చూసి ఫాలో అయిపోవ‌డం బెట‌ర్‌.
Tags:    

Similar News