• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత చేయబోయే సినిమా...

సమంత చేయబోయే సినిమా సెన్సేషనే..

By - Tupaki Desk
Update: 2016-05-30 13:30 GMT
స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని తహతహలాడిపోతున్న సంగతి తెలిసిందే. ఇంకా రిలీజ్ కాకుండానే ఓ కన్నడ సినిమా మీద ఆమెకు మనసు మళ్లింది. అందుకు ఆ దర్శకుడు తీసిన తొలి సినిమానే కారణం. తాను చెప్పిన వైవిధ్యమైన కథతో సినిమా చేయడానికి ఏ నిర్మాతా ముందుకు రాని పరిస్థితుల్లో.. సోషల్ మీడియా ద్వారా క్రౌడ్ ఫండింగ్ తో నిధులు సేకరించి రెండేళ్ల కిందట ‘లూసియా’ పేరుతో ఓ సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు కన్నడ దర్శకుడు పవన్ కుమార్. ఆ సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దాన్ని సమంత మాజీ బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ తమిళంలో రీమేక్ చేశాడు. ఆ సమయంలోనే పవన్ తో పరిచయం పెంచుకున్న సమంత.. అతను తీసిన రెండో సినిమా ‘యు టర్న్’ మీద ఆసక్తి చూపించింది.

ఆ మధ్య ‘యు టర్న్’ ట్రైలర్ రిలీజవ్వగానే సమంత ఇంట్రెస్ట్ రెట్టింపైంది. తన ‘ఫ్రెండ్’ నాగచైతన్యను వెంటబెట్టుకుని వెళ్లి ఈ సినిమా రషెస్ చూసి వచ్చి తెలుగు-తమిళ భాషల్లో రీమేక్ చేస్తే తాను నటించడానికి ఓకే అనేసింది. నిర్మాత కూడా సెట్టయ్యాడు. ‘యు టర్న్’ ఈ నెల 20వ తేదీన కర్ణాటకలో రిలీజైంది. పవన్ తొలి సినిమా మాదిరే దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓ యూటర్న్ దగ్గర వరుసగా కొందరు వ్యక్తులు చనిపోతుంటే.. దాని చుట్టూ ఉన్న మిస్టరీని ఛేదించే నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. హాలీవుడ్ రేంజిలో ఉందంటూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కన్నడలో పెద్దగా పేరున్న నటీనటులేమీ నటించలేదు. ఐతే తెలుగు-తమిళ భాషల్లో సమంత లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తే దానికుండే క్రేజే వేరుగా ఉంటుంది. సమంత నటించే తర్వాతి సినిమా ఇదే కావచ్చు. త్వరలోనే దీని గురించి అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలున్నాయి.
Tags:    
  • SAmantha 
  • U Turn Movie Remake 
  • Telugu NEws 

Similar News

జారిపోతున్న షోల్డర్ తో పరువాల విందు వడ్డిస్తున్న నభా నటేష్!

2026-11-17 00:30 GMT

'ఈఎన్ఈ' గ్యాంగ్‌ను తక్కువ అంచనా వేయకండి

2026-11-16 23:30 GMT

తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!

2026-11-16 22:30 GMT

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?

2026-11-16 19:30 GMT

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

Copyright @2026

Powered by Blink CMS