అప్పట్లో పవన్ చూసి సామ్ అంతలా నవ్వేసిందట!

Update: 2019-09-11 01:30 GMT
టాలీవుడ్ లో స్టార్స్ ఎంతో మంది ఉన్నా.. వారందరికి సంబంధించి వచ్చే వార్తలన్ని దాదాపుగా వారి సినిమాల గురించి.. వారి నటన గురించి.. వారు చేసే ప్రాజెక్టుల గురించే తప్పించి.. వారి వ్యక్తిత్వం గురించో.. వారి పర్సనల్ స్టైల్ గురించో మాట్లాడటం చాలా తక్కువగా ఉంటుంది. కానీ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి మాత్రం ఆయన ఫ్యాన్స్ మొదలు.. ఆయనతో పని చేసిన పలువురు మాట్లాడుతుంటారు.

పవన్ గురించి.. ఆయనలోని సిగ్గు.. బిడియం గురించి ఒక ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు బిడియం చాలా ఎక్కువని పవన్ తరచూ చెబుతుంటారు. అదెంత ఎక్కువన్న విషయాన్ని సమంత మాటల్ని వింటే ఇట్టే అర్థం కావటమే కాదు.. వెండితెర మీద చెలరేగిపోయే పవన్ లో ఇలాంటి కోణమా? అని ఆశ్చర్యపోవాల్సిందే.

అత్తారింటికి దారేది సినిమా షూట్ ను స్విట్జర్లాండ్ లో చేశారని.. ఆ సందర్భంగా చిత్రీకరించిన ఒక పాటకు ఎక్కువ మంది వస్తే. తనకు ఎక్కడలేని సిగ్గు వస్తుందని పవన్ ఇబ్బందిపడ్డారని చెప్పింది. స్విస్ షెడ్యూల్ లో ఆయన సిగ్గు చూసి తాను నవ్వు ఆపుకోలేకపోయినట్లు చెప్పారు.

స్విస్ లో షూటింగ్ చేస్తున్న మరో సమయంలో తమను చూసేందుకు చాలామంది వచ్చారని.. వారిని చూసిన పవన్ తాను వేయాల్సిన స్టెప్పుల్ని వేయకుండా కారవాన్ వద్దకు వెళ్లిపోయినట్లు చెప్పారు. దీంతో.. త్రివిక్రమ్ పవన్ వద్దకు వెళ్లి.. పవన్..నువ్వు చేయగలవని ఆయనలో కాన్ఫిడెన్స్ నింపారని.. ఆ సందర్భంగా నేను చేయగలనా? అని బిడియంగా అడిగే పవన్ ను చేసి తాను నవ్వుకున్నట్లు చెప్పారు.

పవర్ స్టార్ అయినప్పటికీ ఆయనలో బిడియం.. బెరుగ్గా మాట్లాడటం ఎక్కవని చెప్పింది. ఎంతో సాధారణ మనస్తత్వంతో ఉండే పవన్ తో కలిసి పని చేయటం తాను మర్చిపోలేనని.. చాలా ఇష్టమని సమంత చెప్పింది. పవన్ మనస్తత్తవం తనకు బాగా ఇష్టమైన అంశంగా పేర్కొంది సామ్.
Tags:    

Similar News