సామ్ పాన్ ఇండియా క‌థ‌ల‌కే ప్రాధాన్య‌త‌?

Update: 2021-10-18 07:34 GMT
అక్కినేని నాగ‌చైత‌న్య - స‌మంత జంట విడాకులు అభిమానుల‌ను షాక్ కి గురి చేసిన సంగ‌తి తెలిసిందే. పెద్దింటి కోడ‌లు విడాకుల త‌ర్వాత కెరీర్ పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. టాలీవుడ్ లో త‌న కెరీర్ ఇక ముగిసిన‌ట్టేన‌ని ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చార‌మైంది. అందుకే ఇప్పుడు త‌మిళం - హిందీపైనే శ్ర‌ద్ధ పెడుతోంద‌ని కూడా గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి. అంతేకాదు పాన్ ఇండియా కాన్సెప్టులు అయితేనే త‌న‌కు ఆద‌ర‌ణ ఉంటుంద‌ని సామ్ భావిస్తోంద‌ట‌.

స‌మంత ఇటీవ‌ల ఓ త‌మిళ నిర్మాణ సంస్థకు సంత‌కం చేయ‌డ‌మే గాక తెలుగులో శ్రీ‌దేవి మూవీస్ సినిమాకి సంత‌కం చేశారు. కానీ షూటింగుల ప‌రంగా కొన్ని ష‌ర‌తులు విధిస్తున్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. ఏదేమైనా తెలుగులో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని భావిస్తున్నారు కాబ‌ట్టి త‌మిళం హిందీలో కెరీర్ ని బెట‌ర్ గా ప్లాన్ చేస్కోవాల్సి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇటీవ‌ల స‌మంత ప్లానింగ్ ఆ దిశ‌గానే సాగిపోతోంద‌ని ఇక‌పై అంగీక‌రించే ప్రాజెక్టుకు పాన్ ఇండియా అప్పీల్ ఉండాల‌ని భావిస్తోంద‌ని కూడా గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి.

అభిమానులు ప్రేక్షకులు తనకు అండగా ఉంటారని స‌మంత‌ నమ్మకంగా ఉంది. కెరీర్ ప‌రంగా విభిన్నమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. కొంత‌కాలం పాటు తెలుగు దర్శకులతో పనిచేయడానికి సామ్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్ర‌స్తుత ద‌శ‌లో ఈ కొత్త ఫేజ్ లో పాన్-ఇండియా నటి కావాలని సామ్ కోరుకుంటోంది. తమిళం- హిందీ చిత్ర పరిశ్రమలలో ప్రజాదరణ పొందడానికి ఆసక్తిగా ఉంది. ఆ పరిశ్రమల్లో అగ్ర హీరోలు.. పెద్ద ద‌ర్శ‌కుల‌తో పని చేసేందుకు ఆస‌క్తిగా ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. మ‌రోవైపు అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ వంటి కార్పొరెట్ ఓటీటీల‌తో భారీ డీల్స్ కుదుర్చుకునే దిశ‌గా సామ్ ఆలోచిస్తున్నార‌ని వెబ్ సిరీస్ ల‌కు ప్లాన్ చేస్తున్నార‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా విడాకుల ప్ర‌హ‌స‌నం కెరీర్ పై ప్ర‌భావం చూపుతుంద‌ని తాజా స‌న్నివేశం ప్రూవ్ చేస్తోంది.




Tags:    

Similar News