పీరియాడిక్ డ్రామాతో మలయాళ క్రేజీ స్టార్!
విబిన్నమైన క్రైమ్ కామెడీ యాక్షన్ డ్రామాలతో దక్షిణాది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న మలయాళ ఇండస్ట్రీలో యంగ్ స్టార్ టొవినోథామస్ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు.;
మలయాళ ఇండస్ట్రీ కథబలమున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విషయం తెలిసిందే. విబిన్నమైన క్రైమ్ కామెడీ యాక్షన్ డ్రామాలతో దక్షిణాది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న మలయాళ ఇండస్ట్రీలో యంగ్ స్టార్ టొవినోథామస్ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. సూపర్ హీరో స్టోరీతో చేసిన `మిన్నల్ మురళీ`, కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన `2018`, యాక్షన్ అడ్వెంచర్ మూవీ `ఏఆర్ ఎమ్, స్కై మార్షల్ యాక్షన్ థ్రిల్లర్ `ఐడెంటిటీ`, లోక చంద్ర చాప్టర్ 1` వంటి విభిన్నమైన సినిమాలతో మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఎప్పుడూ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ కొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుట్టే టొవినో థామస్ ఇప్పడు మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు తెరలేపాడు. అదే `పల్లి చట్టంబి`. డిజో జోస్ ఆంటోనీ దర్శకుడు. `జన గన మన`, మలయాళీ ఫ్రమ్ ఇండియా వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న డిజో జోస్ ఆంటోనీ ఈ సారి 1950, 1960ల నేపథ్యంలో సాగే కథని ఎంచుకుని టివినో థామస్‌తో ఈ మూవీని చేస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మూవీ ఇది.
దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నౌఫల్, బ్రిజేష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మోషన్ పోస్టర్‌ని తాజాగా టీమ్ విడుదల చేసింది. టొవినో వాయిస్‌తో మొదలైన మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వైట్ లుంగీ, మెరూన్ కలర్ షర్ట్ ధరించి, బారు మీసాలతో టొవినో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్న తీరు సినిమాకు మంచి క్రేజ్‌ని తెచ్చి పెడుతోంది. మోషన్ పోస్టర్‌లోని విజువల్స్ చూస్తుంటే `పల్లి చట్టంబి` మరో కంటెంట్ డ్రైవెన్ మూవీ అని స్పష్టం చేస్తోంది.
1950,1960 నేపథ్యంలో సాగే కథగా దీన్ని దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. మోషన్ పోస్టర్‌లో టొవినో సీరియస్ లుక్, తన స్క్రీన్ ప్రజెన్స్ మూవీపై అంచనాల్ని పెంచేస్తోంది. పైగా ఈ మూవీని మలయాళంతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సరికొత్త నేపథ్యంలో కంటెంట్ ప్రధానంగా రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.