అయ్యో.. సల్మాన్ తో పెళ్లి అనుకుంటే సమంత ఇలా అనేసిందేంటి?
బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ వయసు ఆరు పదుల వయసుకు చేరువ అవుతుంది. ఆయన తోటి హీరోలు పెళ్లి చేసుకుని.. పిల్లలను కూడా ఇండస్ట్రీలో హీరోలుగా హీరోయిన్స్ గా పరిచయం చేశారు. కాని సల్లూ భాయ్ మాత్రం ఇంకా ప్రేమలో మునిగి తేలుతున్నాడు అనే వార్తల్లోనే ఉన్నాడు. సల్మాన్ ఖాన్ పెళ్లి వార్తలు గత మూడు దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. ఆయన ప్రేమ విషయాలు.. పెళ్లి విషయాలు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఎంతో మంది అమ్మాయిల పేర్లు.. హీరోయిన్స్ పేర్లతో సల్మాన్ పెళ్లి వార్తలు వచ్చాయి. ఇటీవల అమెరికన్ ముద్దుగుమ్మ సమంత లాక్ వుడ్ తో సల్మాన్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
సల్మాన్ ఖాన్ తో ఆమె చాలా సన్నిహితంగా గడిపిన ఫొటోలు మరియు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. లాక్ డౌన్ సమయంలో సల్మాన్ ఫామ్ హౌస్ లోనే ఆమె ఉన్న విషయం అందరికి తెల్సిందే. సల్మాన్ కుటుంబ సభ్యులకు సమంత సన్నిహితురాలు అన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంతో ఖచ్చితంగా ఈ అమ్మడు సల్మాన్ ను పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. ఇన్నాళ్లకు అయినా సల్మాన్ ఒక ఇంటి వాడు అవ్వబోతున్నాడని కొందరు సంతోషపడితే మరి కొందరు ఆరు పదుల వయసు రాకముందే సల్మాన్ పెళ్లి పీఠలు ఎక్కుతాడని భావించలేదు.. కాని సమంత వల్ల ఆయన పెళ్లి పీఠలు ఎక్కబోతున్నందుకు సంతోషంగా ఉందంటూ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
సల్మాన్ ఖాన్ ను తాను పెళ్లి చేసుకుంటాను అంటూ వస్తున్న వార్తలపై సమంత లాక్ వుడ్ స్పందించింది. సల్మాన్ ఖాన్ తో పెళ్లి అనే వార్తలు ఎలా వచ్చాయో నాకు అర్థం అవ్వడం లేదు. ఆయన్ను కలిసిన మాట వాస్తవం.. ఆయనతో కలిసి వర్క్ చేశాను. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఇతరుల పట్ల చాలా గౌరవంగా ఉంటారు. అంత మాత్రాన ఇలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తారో అర్థం కావడం లేదు.
నేను సల్మాన్ నే కాకుండా హృతిక్ రోషన్ ను కూడా కలిశాను. ఆయన తో వర్క్ చేసే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. అప్పుడు నేను హృతిక్ రోషన్ ను కూడా పెళ్లి చేసుకున్నట్లుగా మాట్లాడుతారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. సల్మాన్ తో అంత క్లోజ్ గా ఉండి నేను హృతిక్ రోషన్ ను కూడా కలిశాను.. ఆయనతో కూడా నా పెళ్లి అంటారా అంటూ మాట్లాడింది ఏంటీ అంటూ ఆమె వ్యాఖ్యలను సల్మాన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పెళ్లి చేసుకుంటుందని భావిస్తే ఇలా మాట్లాడటం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.