సమంత క్యూట్ లుక్ చూశారా!!
పెళ్లయ్యాక హీరోయిన్లు రాణించడం... వారికి ముందులా అవకాశాలు రావడం చాలా అరుదు. కానీ సమంత ఇందుకు మినహాయింపు. ఆమె పెళ్లికి ముందు కన్నా పెళ్లయ్యకే బిజీ అయిపోయింది. 2018లో అత్యధిక సినిమాలు చేసే నటి ఆమెనే కావడం విశేషం. అభిమానులను ఈ ఏడాది పండగేనన్నమాట. వారిని అలరించడం కోసం అప్పుడుప్పుడు మెరుపు లాంటి ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టుచేస్తుంటుంది. ఇదిగో అలాంటి ఫోటోలో ఇదీ ఒకటి.
సమంతకు సినిమా ఆఫర్లో పాటూ షాపులు ఓపెన్ చేయమని వచ్చే అవకాశాలు అమాంతం పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆమె షాపులు ఓపెన్ చేస్తోంది. తాజాగా హైదరాబాద్ లో సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 9 లాంచ్ చేసింది. ఈ సందర్భంగా అదిరే డ్రెస్సులో అభిమానులకు కనుల విందు చేసింది. ధోతీ శారీని పోలినట్టున్న సిమెంట్ రంగు డ్రెస్సులో హాట్ లుక్స్ తో కనిపించింది. ఫోటోలకు ఫోజులిచ్చి ఆ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఇంకేముంది యథావిధిగా సమంత ఐలవ్ యూ అంటూ కామెంట్లు లైకులు పెరిగిపోయాయి. ఇప్పటికే ఆ ఫోటోపై రెండు లక్షల మందికి పైగా స్పందించారు. ఇంకా ఆ సంఖ్య పెరుగుతోంది.
ఈ నెల సమంత నటించిన రంగస్థలం థియేటర్లలోకి రానుంది. అలాగే మహానటి సినిమాలో కూడా ఈమె నటిస్తోంది. మూడు తమిళ సినిమాలు కూడా అమ్మడి చేతిలో ఉన్నాయి. అంతేనా త్వరలో తన భర్త చైతూతో కలిసి నటించేందుకు సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. ఏమైనా పెళ్లయ్యాక సమంతకు బాగా కలిసొచ్చింది.
మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి