ఈ డ్రెస్సులు ఇష్టపడతాం.. కానీ వేసుకోలేం : సమంత

Update: 2020-12-22 10:19 GMT
అక్కినేని కోడలు సామ్.. జామ్ జామ్ అంటూ దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన సమంత.. పెళ్లయిన తర్వాత ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది. లేటెస్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫాంలో ‘సామ్ జామ్’ పేరుతో సెలబ్రిటీ ‘టాక్ షో’ చేస్తోంది. ‘ఆహా’ సంస్థ కండక్ట్ చేస్తున్న ఈ షోకు హోస్ట్ వ్యవహరిస్తున్న సామ్.. తన మాటలతో అందరినీ మాయ చేస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్ లో మెగా స్టార్ ను ఇంటర్వ్యూ చేసి.. సందడి చేసింది ఈ బ్యూటీ. 25న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

కాగా.. సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో చక్కర్లు కొడుతోంది. ఫ్యాషన్ షోలలో మోడల్స్ వేసుకుని, ర్యాంప్ పై హొయలొలికించే క్యాస్టూమ్స్ ధరించిన సమంత.. ‘ఇవి ఇష్టపడతాం.. కానీ వేసుకోలేం’ అంటూ డబ్ స్మాష్ తరహాలో ఆడియో కూడా యాడ్ చేసింది.

ఈ వీడియోలో మొత్తం 6 రకాల డ్రెస్సుల్లో కనిపించిన సమంత.. ‘వియ్ లవ్ ఇట్.. కుడ్ నాట్ వియర్ ఇట్’ అంటూ నవ్వించింది. ఫాస్ట్ ఫార్వడ్ లో సాగిన వీడియో.. ఆడియో.. చూసేవారికిి కావాల్సింత ఫన్ అందిస్తోంది. పింక్ విల్లా ట్విట్టర్ అకౌంట్లో లేటేస్ట్ గా పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/p/CJF50OYpF81/
Tags:    

Similar News