ఫోటో స్టొరీ: జిమ్ములో సామ్ అలా..

Update: 2019-01-25 11:29 GMT
సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఫిట్నెస్ ను కాపాడుకోవడం చాలా ముఖ్యం.  అందులోనూ హీరోయిన్ల మెయిన్ ఫోకస్ గ్లామర్ మీద ఉంటుంది కాబట్టి జిమ్ముకు వెళ్ళడం.. కసరత్తులు చేయడం చాలా కామన్.  ఈ ఎక్సర్ సైజులు సాధారణంగా చేస్తే ఏం థ్రిల్ ఉంటుందని అనుకుందో ఏమోగానీ సమంతా మాత్రం కఠినమైన కసరత్తులు చేస్తోంది.  

రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా 'కార్ట్ వీల్' ఎక్సర్ సైజును ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపింది.   అంటే..సైడ్ కు పల్టీ కొట్టడం అన్నమాట.  ఈ కార్ట్ వీల్ కోసం ప్రాక్టిస్ చేసూ ఒక ఫోటో పోస్ట్ చేసింది.  అందులో తలకిందులుగా చేతులపై నిలబడింది.  సమంతా కాళ్ళకు మాత్రం జిమ్ మాస్టర్ జాక్సన్ అలా తన బొటనవేలును సపోర్ట్ గా ఉంచారు. ఈ ఉల్టాపల్టా పోజివ్వడం అంత సులువేమీ కాదు. సమంతా ఏదో  చేసిందని మీరు ట్రై చేసి చేతులు కాల్చుకోవద్దు.

ఇదిలా ఉంటే ఈ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత యా కార్ట్ వీల్ ఎక్సర్ సైజ్ చేస్తూ ఉన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది.  ఆ వీడియోకు "మీరు ఏ పనైతే బాగా చేస్తారో అంతకంటే బెటర్ గా చేయడానికి ప్రయత్నించకపోతే మీరు ఎప్పటికీ ప్రగతి సాధించలేరు." అంటూ ఓ  క్యాప్షన్ ఇచ్చింది. సామ్ చెప్పింది కదా.. నిజమే అయి ఉంటుంది.


Tags:    

Similar News